జగనన్న వస్తాడు రాజన్న రాజ్యం తెస్తాడు ఇదీ నినాదం. జగన్ వెంట మొదటి నుంచి వున్న వారు, మధ్యలో చేరిన వారు ఆ తరువాత వచ్చి చేరిన వారు ఇలా లిస్ట్ ఒకటి తయారు చేస్తే ఎక్కువమంది గత కాంగ్రెస్ సర్కార్లో పనిచేసిన వారు, వైఎస్సార్ హయాంలో ఓ వెలుగు వెలిగిన వారు కనిపిస్తారు.


ఇపుడు వారిలో కొందమందికి జగన్ మంత్రి పదవులు ఇచ్చాడు. కొందరికి ఇవ్వలేదు. కానీ జగన్ స్టైల్ చూసిన వారు మాత్రం ఇది రాజన్న రాజ్యం కాదని, జగన్ మార్క్ రాజ్యమని అంటున్నారు. ఇది పొగడ్తో విమర్శో కానీ ఇపుటికైతే జగన్ బాగా స్ట్రిక్ట్ గా ఉంటున్నారు. ఏకంగా మంత్రులకే ఆయన గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి పదవి భాధ్యత  అన్నారు.


నిజానికి కాంగ్రెస్ లో కానీ నిన్నటి టీడీపీలో కానీ అది హోదాయే. ఆ విధంగానే అంతా అలవాటు పడ్డారు. రాజకీయ జీవులు మంత్రులు అయ్యామనుకునేది కూడా ఆ హోదా కోసమే. మరి జగన్ బాధ్యత అంటున్నారు. అవినీతి లేని రాజ్యం అంటున్నారు.  జగన్ వరకూ ఒకే. మరి మంత్రులకు ఇది మింగుడు పడుతుందా. చాలా మందికి ఇంకా జగన్ థియరీ అర్ధం అయిందా కాలేదా. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: