సమాజానికి ఎన్నో నీతులు చెప్పి తాను మాత్రం పాటించటం మరిచిపోయాడు రవిప్రకాష్. తాను తప్పు చేయలేదని పైకి సమర్థించుకుంటున్నా చేసిన తప్పులు కళ్ళముందు సాక్ష్యాలతో సహా కంటికి కనిపిస్తున్నాయి. నిజంగా తప్పు చేయకపోయి ఉంటే పోలీసులు నోటీసులు ఇచ్చిన తరువాత కూడా దాక్కోవాల్సిన అవసరం ఏముంది రవిప్రకాష్ మొదటిసారి నోటిసులు ఇచ్చినప్పుడే పోలీసులకు సహకరించి ఉండొచ్చు కదా.

 

పోలీసులు మాత్రం కేసులో బలమైన సాక్ష్యాలనే సంపాదించారట. ప్రస్తుతానికి రవిప్రకాష్ అరెస్ట్ కాకపోయినా అతి త్వరలో అరెస్ట్ అయ్యే అవకాశం మాత్రం ఉంది. కేసుల నుండి రవిప్రకాష్ తప్పించుకునే పరిస్థితులు కూడా లేవని తెలుస్తోంది. పోలీసులు తమ దగ్గర ఉన్న సాక్ష్యాలను కోర్టుకు అందిస్తే కోర్టు రవిప్రకాష్ కు సిక్ష పడటం మాత్రం ఖాయమే

 

రవిప్రకాష్ తన తప్పు ఒప్పుకున్న సాక్ష్యాన్ని కూడా పోలీసులు రికార్డ్ చేసి తమ దగ్గర ఉంచుకున్నారట.మరి కేసులో ఇంకా ఏఏ కొత్త విషయాలు తెలుస్తాయో చూడాలి. రవిప్రకాష్ తో పాటు నోటీసులు అందుకున్న శివాజీ ఇంకా విచారణకు హాజరు కాలేదు. శివాజీ కూడా విచారణకు వస్తే కేసులో మరికొన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: