2019 ఎన్నికల్లో కేబినేట్లో ఖచ్చితంగా రోజా గారికి స్థానం ఉంటుందని అంతా అనుకున్నప్పటికీ అందరి అంచనాలకు భిన్నంగా రోజా గారికి కేబినేట్లో ఎటువంటి మంత్రి పదవి లాభించలేదు. మంత్రులుగా ఎవరిని నియమిస్తున్నారో ముందుగా సమాచారం ఎవరికీ అందించకపోవటంతో రోజా గారు తనకు మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

 

కానీ రోజా గారు మంత్రి పదవి ఇవ్వకపోవటం అనేదీ రోజాతో పాటు వైసీపీలో చాలా మందిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి. అప్పటి వరకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన రోజాకు జగన్ నిర్ణయం చాలా భాదపెట్టింది. కేబినేట్ విస్తరణ తరువాత రోజా గారు మీడియాకు కూడా అందుబాటులోకి రాలేదు.

 

ప్రస్తుతానికి రోజాకు ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చి భవిష్యత్తులో మంత్రివర్గంలో తప్పక అవకాశం ఇవ్వాలని వైసీపీ అభిమానులు ఆశిస్తున్నారు. ఏదైనా స్పష్టమైన హామీ జగన్మోహన్ రెడ్డి గారి నుండి వస్తే మాత్రమే రోజాకు భాద తగ్గే అవకాశం ఉంది. సామజిక వర్గ సమీకరణల వల్ల రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోయిన సీఎం జగన్మోహన్ రెడ్డి మరో విధంగా న్యాయం చేస్తాడేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: