ముఖ్యమంత్రి యువనేస్తం నిరుద్యోగ భృతి పథకం గురించి గందరగోళం ఇంకా తీరలేదు. ఈ పథకం అమలుపై ఎటువంటి స్పష్టతా రాలేదు. కేబినేట్ మీటింగ్లో ఈ పథకం గురించి ఎలాంటి నిర్ణయం వెలువడలేదు.ఈ పథకం అమలుపై సందేహాలు ఇంకా వీడలేదు.
పది రోజులైనా ఈ పథకం గురించి ఎలాంటి సమాచారం లేకపోవటం పట్ల నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం గురించి ఇస్తారో లేదో ఏదో ఒక విషయం తెలిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పథకం గురించి ఎవరి దగ్గరా ఎటువంటి స్పష్టమైన సమాచారం లేకపోవటం పథకం లబ్దిదారులను నిరాశకు గురి చేస్తుంది.
నిరుద్యోగ యువత కనీస ఖర్చులకు ఈ పథకం చాలా ఉపయోగపడింది.సుమారు ఐదు లక్షల మంది యువత ఈ పథకంతో లభ్ది పొందారు. యువత ఏదో ఒక ఉద్యోగం పొందే దాకా ఈ పథకాన్ని కొనసాగించి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు