చట్టం ముందు అందరు సమానమే.  తప్పు చేసిన ఎవరూ తప్పించుకోలేరు.  సామాజ్య జనం కావొచ్చు, ఎంపీ కావొచ్చు లేదంటే ఎమ్మెల్యే కావొచ్చు.  ఎవరైనా సరే తప్పు చేస్తే.. తప్పించుకోవడం చాలా కష్టం.  అగర్తలాలోని ఓ ఎమ్మెల్యేకు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. 


త్రిపురలోని రిమా వ్యాలీ ఐపీఎఫ్‌టీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ధనుంజోయ్‌ త్రిపుర పై కొన్ని రోజుల క్రితం ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది.  తనతో కొన్ని రోజులుగా ధనుంజోయ్ సహజీవనం చేస్తున్నాడని, ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే పట్టించుకోవడం లేదని కేసు పెట్టింది. 

మహిళలకోసం ఉన్న చట్టాలు  చాలా స్ట్రాంగ్ గా ఉండటంతో ధనుంజోయ్ కు ఏం చేయాలో తెలియలేదు.  చివరికి ధనుంజోయ్ తనపై కేసు ఫైల్ చేసిన మహిళతనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. 


ఈ కేసు విషయంలో ధనుంజోయ్  ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశాడు.  కానీ, కుదరలేదు.  ధనుంజోయ్ కు బెయిల్ ఇచ్చేందుకు కోర్ట్ నిరాకరించింది.  దీంతో చేసేది లేక ఆదివారం రోజున ఆ ఎమ్మెల్యే దలాయి  మహిళను వివాహం చేసుకోవాల్సి వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: