ప్రపంచంలో మాతృత్వాన్ని మించినది ఏదీ లేదు. మనుషులు మాత్రమే కాదు పశుపక్ష్యాదులు సైతం తమ పిల్లల కోసం పడే ఆరాటం..ఆవేదన మన కళ్లతో చూస్తే అర్థం అవుతుంది.  ఒక చిన్న పక్షి తన గూటిలో చిన్నపిల్లలకు రెక్కులు వచ్చే వారకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి...ఇక సాదు జంతువుల నుంచి కృరమృగాల వరకు తమ పిల్లలు ఆహారం సంపాదించుకునేంత వరకు వాటిని అన్ని విధాలుగా చూసుకుంటాయి. ఇక మనుషల విషయానికి వస్తే..కన్న పిల్లల కోసం చచ్చేవరకు ఆరాట పడుతూనే ఉంటారు.

తమ ఇంట్లోని ఓ సభ్యుడు చనిపోతే ఐనవారు..బంధువులు, స్నేహితులు వచ్చిన కన్నీటి వీడ్కోలు పలుకుతారు..సంతాపం తెలియజేస్తారు.  ఇదే ఇప్పుడు మూగజీవాలు కూడా చేశాయి..ఓ ఏనుగు తన బిడ్డ చనిపోతే, దాన్ని మోసుకుంటూ రోడ్డుపైకి వచ్చింది. బాధతో దాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించింది.  ఆ సమయానికి మరికొన్ని ఏనుగులు అక్కడకు వచ్చి తల్లి ఏనుగును ఓదార్చుతున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. 

ఆపై దాన్ని మోసుకొచ్చిన తల్లి ఏనుగే, మృతదేహాన్ని తీసుకుని అడవిలోకి వెళ్లిపోయింది. దీన్నంతా గమనించిన  పర్వీన్ అనే అటవీ అధికారి వీడియో తీసి  ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. దాదాపు 20 ఏనుగుల గుంపు ఇక్కడ కనిపిస్తోంది. ఆ దారిలో వెళుతూ ఆగిన కొందరు ప్రజలు కూడా వీక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: