వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేశారు.  ఈ ఓదార్పు యాత్ర మొదట తెలంగాణలో స్టార్ట్ చేసి.. చాలా ప్రాంతాల్లో అయన పర్యటించారు.  ఎప్పుడైతే 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు విడిపోయాయో... అప్పటి నుంచి జగన్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో ఓదార్పు యాత్ర చేశారు.  2017 వ సంవత్సరం నుంచి జగన్ పాదయాత్ర చేశారు. 


ఈ పాదయాత్ర ఫలితం.. వైఎస్ జగన్ కు అధికారం సంక్రమించడం.  పాదయాత్ర సమయంలో జగన్ ప్రజల నుంచి అనేక విషయాలు తెలుసుకున్నారు.  వాళ్ళ బాధలను తెలుసుకున్నారు.  సమస్యలను గురించి తెలుసుకున్నారు.  వాళ్లకు హామీ ఇచ్చారు.  


ఇప్పుడు అధికారంలోకి వచ్చాడు జగన్.  జగన్ అధికారంలోకి వచ్చాక దూసుకుపోతున్నారు.  దూకుడు పెంచారు. ఇదిలా ఉంటె, చంద్రబాబు నాయుడు పార్టీ పరాజయం పాలయ్యాక ఆయనను ఓదార్చేందుకు అనేక మంది ఇంటికి వస్తున్నారు.  


ప్రజలు వచ్చి ఓదార్చడం ఎందుకు తానే ప్రజల వద్దకు వెళ్తే.. బాగుంటుంది కదా అనుకుంటున్నారు.  త్వరలోనే బాబు ప్రజల వద్దకు ఓదార్పు కోసం వెళ్ళబోతున్నారని తెలుస్తోంది.  అప్పట్లో జగన్ ఓదార్పు యాత్ర చేస్తే.. ఇప్పుడు బాబు మరలా ఓదార్పు యాత్ర చేయబోతున్నారన్నమాట.  



మరింత సమాచారం తెలుసుకోండి: