ఏపీలో ఇసుక తవ్వకాలకు  బ్రేక్ పడనుంది. ఇప్పటికిపుడు తవ్వకాలకు చెక్ చెప్పేసింది జగన్ సర్కార్. కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇసుక తవ్వకల విషయంలో చాలా కఠినంగా ఉంటోందనడానికి ఇదే నిదర్శం.  టీడీపీ జమానాలో ఇంతకు  ముందున్న విధానాలు సరేసరి. వాటిని సమీక్షిస్తున్న నేపధ్యంలో  తాత్కాలికంగా బ్రేక్ వేస్తున్నట్లుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు.


ఆయన ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ఇసుక తవ్వకాలకు బ్రేక్ ఇచ్చామని, ఎవరైనా ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం  సీరియస్ గా అధ్యయనం చేస్తోందని అన్నారు.  ప్రభుత్వం పదిహేను రోజుల వ్యవధిలో కొత్త పాలసీని తీసుకురావాలనుకుంటోందని ఆయన వెల్లడించారు.  


ఇదిలా ఉండగా జగన్ తన పాదయాత్ర సందర్భంగా ప్రతీ చోటా ఇసుక మాఫియా అంటూ హాట్ కామెంట్స్ చేసేవారు. తమ ప్రభుత్వం వస్తే ఆట కట్టిస్తామని కూడా చెప్పారు. ఇపుడు ఎటూ అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇసుక మాఫియాను భరతం పట్టేలా ప్రభుత్వం చర్యలు ఉంటాయని అంటున్నారు. ఈ విషయంలో రెండవ ఆలోచన లేదని, పూర్తి పారదర్శకంగా తమ ప్రభుత్వ విధానాలు ఉంటాయని వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. మరి చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: