టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు స్టైలే వేరు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ కుండబద్దలు కొట్టే మోహన్ బాబు తన తీరు వల్ల ఇండస్ట్రీలో ఎక్కువ మంది శత్రువుల్ని సంపాదించుకున్నార‌న్న అభిప్రాయం సహజంగా అందరి నుంచి వినిపిస్తూ ఉంటుంది. తాను ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని మోహన్ బాబు ఎవరేమనుకున్నా వినకుండా ఓపెన్‌గా చెప్పేస్తారు.  గతంలో ఎన్టీఆర్ వుండగా రాజ్యసభకు ఎంపికైన మోహన్‌బాబు ఆ తర్వాత చాలా రోజుల పాటు చంద్రబాబుతో విభేదించి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరసకు చంద్రబాబు మోహన్‌బాబుకు మేనత్త కొడుకు అయినా వీరిద్దరి మధ్య అంతా సఖ్యత లేదు.


ఇక మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు వైఎస్.జగన్మోహన్‌రెడ్డి చిన్నాన్న కుమార్తెను వివాహం చేసుకోవడంతో వీరిద్దరి మధ్య బంధుత్వం కలిసింది. ఇక ఎన్నికలకు ముందు మోహన్ బాబు వైసిపిలోకి జంప్ చేసి ఆ పార్టీ తరఫున కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. మోహన్ బాబు ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారు అన్న పుకార్లు షికార్లు చేశాయి. అయితే దీనిపై స్పందించిన ఆయన తనకు ఎలాంటి పదవిపై ఆశలేదని... జగన్మోహన్‌రెడ్డి సీఎం అవటమే తన ధ్యేయమని ప్రకటించిన సంగతి తెలిసిందే.


ఈ ఎన్నికల్లో ఇండ‌స్ట్రీకే చెందిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీ త‌ర‌పున పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ప‌వ‌న్ కూడా పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ప్ర‌స్తుతం ప‌వ‌న్ త‌మ పార్టీ ఓట‌మిపై జిల్లాల వారీగా స‌మీక్ష‌లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆవేశపూరిత ప్రసంగాలు కూడా చేస్తున్నారు. త‌న ఓట‌మికి భీమ‌వ‌రంలో వైసీపీ రూ.150 కోట్లు ఖ‌ర్చు చేసింద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఈ వ్యాఖ్య‌లపై మోహ‌న్‌బాబు స్పందించారు.  “చిరుని విమర్శిస్తూ చిరు ఫ్యాన్స్ తో లొల్లి ఆపనంత వరకు జనసేనకు మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుంది. టీడీపీకి భజన చేసాడనే బాధ వాళ్ళను వైసీపీకి దగ్గర చేసింది. ఇంకా కెలకడం వలన జరిగే మేలు ఏ మాత్రం లేదు.ఓటమికి కారణాలు చెబితేనే తట్టుకోలేక పోతున్నారు. ఇక ఏం నేర్చుకుంటారు -జనసేన శ్రేయోభిలాషి” అని ట్వీట్ చేశారు.


మోహ‌న్‌బాబు వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే జ‌న‌సేన పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసుకుంటే భ‌విష్య‌త్తులో అయినా విజయం దక్కుతుందని వ్య‌గ్యంగా ప‌వ‌న్‌పై సెటైర్ వేశారు. ఇక ఎన్నిక‌ల‌కు ముందు మోహ‌న్‌బాబు టీడీపీని, చంద్ర‌బాబును కూడా తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేసిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: