ఇక నుంచి ఏపీలో రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాలకి వెళ్లాల్సిన పనిలేదు. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబేతోంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. 


5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు. బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని ఈ రోజు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: