జూన్... మృగశిర కార్తె ప్రారంభం తొలకరి జల్లులు కురిసే మాసం.. ఏరువాక మొదలౌతుంది... దానితో పాటు విద్యార్థుల స్కూల్స్ కూడా ప్రారంభం అవుతాయి.  రైతులకు విత్తనాలు కావాలి.. విద్యార్థులకు స్కూల్ ఫీజులు కట్టాయి. వీటికి డబ్బులు కావాలి...  రైతులకు.. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు పక్కన పెట్టేస్తుంది.  మరి వీరి పరిస్థితి ఏంటి..?

రైతు పంట పండించాలంటే విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని ప్రియం.  స్కూల్స్ లో చేర్పించాలంటే ఫీజులు మోత మోగిస్తున్నాయి.  మధ్యతరగతి కుటుంబాల్లో ఇది కామన్ గా కనిపించే అంశం.  జూన్ నెలకు నెల రోజుల ముందు నుంచే పాపం వీటి కోసం కుస్తీ పడుతుంటారు.  

విత్తనాలు, ఇతర ఖర్చుల కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవాలా అని ఆలోచిస్తున్నారు. అప్పుల కోసం ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పేద, మధ్య తరగతి కుటంబీకుల జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది.  

విద్యార్థులు, రైతులు పడే బాధలు ప్రభుత్వానికి పట్టవు.  ఇలాంటివి ప్రతి ఏడాది వస్తూనే ఉంటుంది కాబట్టి ప్రభత్వం వాటి గురించి పెద్దగా పట్టించుకోదు.  మరి వీళ్ళను ఆదుకునేది ఎవరు..? తెలంగాణలో పాత ప్రభుత్వమే కంటిన్యూ అవుతున్నది.  ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి అచ్చింది.  స్కూల్ కు వెళ్లే పిల్లకు 15వేల రూపాయలు ఇస్తామని జగన్ ప్రకటించారు.  మరి దాన్ని అమలు చేస్తారా..? రైతు భరోసా పథకం ద్వారా విత్తనాల కోసం డబ్బులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.  ఈ హామీ నెరవేరుతుందా... చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: