దేశంలో ఓటమి ఎరుగని మహానాయకుల్లో రామ్ విలాస్ పాశ్వాన్ ఒకరు.  బీహార్ కు చెందిన ఈ నేత గురించి రాజకీయాల్లో టచ్ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.  ఎప్పుడు పోటీ చేసినా భారీ మెజారిటీతో విజయం సాధించేవారు.  కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు.  

దళిత నేతగా పేరున్న ఈ నేత అంచనాలు వేయడంలో దిట్ట.  ఏ పార్టీ విజయం సాధిస్తుందో ఖచ్చితంగా అంచనా వేసి.. ఆ పార్టీలో జాయిన్ అవుతుంటాడు.  2014 లో మోడీ వేవ్ ను గుర్తించి ఆ పార్టీలో జాయిన్ అయ్యాడు.  కేంద్ర మంత్రి పదవిని కొట్టేశాడు.  కేంద్రంలో పొత్తు ఉన్నా.. అప్పుడప్పుడు కేంద్రంపై విమర్శలు చేస్తుంటారు.  

అయితే, 2019 లో ఎన్డీఏ నుంచి బయటకు రావాలని అనుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమస్యలను గుర్తించి.. ఎన్డీఏ తో పొత్తు పెట్టుకున్నారు.  బీహార్ లో 7 స్థానాలకు పోటీ చేస్తే 6 స్థానాలు గెలుచుకుంది జనశక్తి పార్టీ.  ఈసారి రామ్ విలాస్ పాశ్వాన్ పోటీ చేయలేదు.  

అయినప్పటికీ ఆయనకు కేంద్రమంత్రి పదవి వరించింది.  త్వరలోనే ఆయన్ను రాజ్యసభకు పంపించనున్నారు.  ఇక బీహార్ నుంచి పోటీ చేసిన తన ఇద్దరు కుమారులు ఎంపీలుగా తెలిచారు.  దళిత పార్టీగా చెప్పుకున్న జనశక్తి ఇప్పుడు కుటుంబ పార్టీగా అవతరించిందన్న మాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: