వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి నెలైనా కాలేదు నవరత్నాల్లో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తున్నాడు. పాలనాపరమైన అనుభవం లేకపోయినా సీఎం గా జగన్మోహన్ రెడ్డి శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు, అధికారులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎంతో మేలు చేకూర్చబోతున్నాయి

 

రైతులు జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల సంతృప్తి చెందుతున్నారు. అక్టోబర్ నుండి ప్రతి సంవత్సరం 12,500 రుపాయల పెట్టుబడి సాయం, వడ్డీలేని రుణాలు, ధరల స్థిరీకరణ నిధి, ఉచితంగా బోర్లు రైతులకు ఎంతో మేలు చేస్తాయి. అమ్మ ఒడి పథకం ద్వారా వచ్చే సంవత్సరం జనవరి 26న ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో చదువుతున్న పిల్లలలకు 15,000 రుపాయల లబ్ధి చేకూరబోతుంది. 5 లక్షల 60 వేల ఉద్యోగాల నియామకం జరగబోతుంది

 

గత ఐదేళ్ళు పరిపాలించిన నాయకుల్ని జగన్ ఆలోచలు, పథకాలు అమలు చేస్తున్న తీరు ఆశ్చర్యపరుస్తున్నాయి. గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు పరిచి ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో ఇంత తక్కువ సమయంలో హామీలన్ని అమలు చేస్తూ విమర్శించే అవకాశం కూడా లేకుండా ఎంత పని చేసావ్ జగన్ అని ప్రతిపక్షాలు అనుకుంటున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: