వైఎస్ జగన్ అసెంబ్లీకి నమస్కారం పెట్టేసి రెండేళ్ళు అవుతోంది. సరిగ్గా 2017 బడ్జెట్ సమావేశాలకంటే ముందు అంటే ఉగాది రోజున నలుగుగు ఫిరాయింపు ఎమ్మెల్యేలను మంత్రులుగా చేర్చుకుని అప్పటి చంద్రబాబు సర్కార్ వైసీపీని ఇబ్బందుల పాలు చేసింది. దానికి నిరసన‌గా జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేసారు.


తమ పార్టీ నుంచి గెలిచిన వారిని అక్రమంగా తీసుకోవడమే కాకుండా మంత్రులుగా ఎలా నియమిస్తారంటూ జగన్ చంద్రబాబుని నిలదీశారు. దీని మీద గవర్నర్ కి వినతిపత్రం కూడా అందించారు. అయినా సరే బాబు సర్కార్ ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో దూకుడుగా వెళ్ళింది. దాంతో తన పార్టీ నుంచి గెలిచి ఫిరాయించి మంత్రులైన వారు అసెంబ్లీలో ఉంటే తాను సభకు రాలేనని జగన్ కచ్చితంగా చెప్పేశారు.


ఏ విషయమైనా ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని ఆయన గట్టిగా నిర్ణయించుకుని అదే ఏడాది నవంబర్ 6న పాదయాత్ర చేపట్టారు. జగన్ తో పాటు ఆయన ఎమ్మెల్యేలు మొత్తం అసెంబ్లీని బహిష్కరించారు. ఈ మొత్తం వ్యవహారంలో టీడీపీని జగన్ దోషిగా జనం ముందు పెట్టారు. ఇపుడు బంపర్ మెజారిటీతో నెగ్గి అసెంబ్లీకి జగన్ ముఖ్యమంత్రి హోదాలో హాజరవుతున్నారు. అసెంబ్లీ విలువను, పవిత్రతను కాపడుతామని చెప్పిన గొప్ప నాయకుడిగా జగన్ సీఎం హోదాలో అడుగుపెడుతున్నారు. ఇది నిజంగా గొప్ప విషయం. 


మరింత సమాచారం తెలుసుకోండి: