చూడబోతే పరిస్ధితులు అలాగే కనిపిస్తున్నాయి అందరికీ.  ఏ విధంగా చూసినా టిడిపి తప్పించుకునే చాన్సే కనబడటం లేదు. ఎందుకంటే సభలో వైసిపి బలం 151 అయితే టిడిపికి ఉన్నది కేవలం 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే. సో సంఖ్యా బలం రీత్యా టిడిపి ఏ విధంగా చూసినా జగన్మోహన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చే అవకాశం కనబడటం లేదు.

 

ఇదంతా ఇపుడెందుకంటే అసెంబ్లీలో వైసిపిని ఎక్కడికక్కడ ఎండగట్టాలని చంద్రబాబు తన ఎంఎల్ఏలను ఆదేశించారు. అసెంబ్లీ బయటే కాదు లోపల కూడా వాళ్ళు చేయగలిగేది ఏమీ లేదనేది స్పష్టం. తన హయాంలో చంద్రబాబు అండ్ కో అసెంబ్లీలో జగన్ అండ్ కో విషయంలో ఏ విధంగా వ్యవహరించింది ఒక్కసారి గుర్తుంచుకోవాలి.

 

నిజంగానే వైసిపి గనుక దెబ్బకు దెబ్బ తీయాలని అనుకుంటే టిడిపిలోని చాలామంది శాసనసభ్యులను సభ నుండి ఏదో రూపంలో బయటకు గెంటేయవచ్చు. సభలో అడిగే దిక్కు కూడా లేదన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ గతంలో టిడిపి  వ్యవహరించినట్లు తాము అలా వ్యవహరించబోమని వైసిపి ఎంఎల్ఏలు చెబుతున్నారు. మరి మాట మీద అధికార పార్టీ ఎంఎల్ఏలు ఎంత వరకూ నిలబడతారో చూడాల్సిందే.

 

అదే సమయంలో ఐదేళ్ళ చంద్రబాబు పాలనలోని డొల్లతనం, అవినీతి విషయాలపైన మాత్రం సభలో విస్తృతంగా చర్చ జరిగే అవకాశాలున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నపుడే చంద్రబాబు అవినీతిని జగన్ అండ్ కో ప్రశ్నిస్తే తట్టుకోలేకే బయటకు పంపేసేవారు. అలాంటిది ఇపుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి అవకాశాన్ని వదులుకుంటుందా ? మరి అలాంటి సమయంలో చంద్రబాబు ఏం చేస్తారన్నది ఆసక్తికరం.

 

నిబంధనలకు విరుద్ధంగా రోజా తో పాటు చాలామంది ఎంఎల్ఏలను సస్పెండ్ చేసిన విషయం అందరూ చూసిందే. చంద్రబాబును నిలదీస్తున్నారని అనుకుంటే చాలు సభనుండి గెంటేయటమే అప్పట్లో. రోజా సస్పెన్షన్ ను  హైకోర్టు తప్పు పట్టినా కూడా చంద్రబాబు, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏమాత్రం లెక్క చేయలేదు. ఏదేమైనా అప్పట్లో వ్యవహరించినట్లే ఇపుడు కూడా వ్యవహరిస్తే మాత్రం చుక్కలు కనబడటం ఖాయం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: