ఆంధ్రప్రదేశ్ లో అఖండ విజయం సాధించిన వైఎస్ఆర్ సీపీకి మరో అదృష్టం కలిసి రాబోతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.లోక్ సభ లో అధ్యక్షా అని పిలిపించుకునే అవకాశం ఆ పార్టీకి దక్కనున్నట్లు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో 151 స్థానాలతో దాదాపు క్లీన్ స్వీప్ చేసిన జగన్ పార్టీ, లోక్ సభ ఎన్నికలలో కూడా సత్తా చాటింది.25 స్థానాలలో 22 స్థానాలు గెలుచుకొని వార్ వన్ సైడ్ చేసింది.

బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ప్రధాని మోడీ లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని వైఎస్ఆర్సీపీకి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.దీనికి కారణం జగన్ పార్టీ దేశంలోనే నాలుగో అతి పెద్ద పార్టీగా అవతరించడం.మూడో స్థానంలో ఉన్న DMK కు అవకాశం ఇవ్వాలని భావించినప్పటికీ డీఎంకే పార్టీ కాంగ్రెస్ కు మిత్రపక్షంగా ఉంది.దీంతో లోక్ సభ సమావేశాల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని భావిస్తున్నారు.దీంతో జగన్ పార్టీ వైఎస్సార్ సీపీ అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని వారికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇదే విషయమై మంగళవారం వైఎస్ జగన్ తో చర్చించినట్లు తెలుస్తుంది.అయితే దీనిపై వైఎస్ జగన్ ఎలాంటి అభిప్రాయం తెలపలేదు.ఈ విషయం పార్టీలో చర్చించి తమ నిర్ణయాన్ని తెలుపుతామని చెప్పారు.అయితే ఈ పదవిని స్వీకరిస్తే బిజెపికి అనుకూలంగా మారినట్లు సంకేతాలు వెళతాయనివెళతాయని, దీని పట్ల వ్యతిరేకత వస్తుందేమో అని జగన్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ఎందుకంటే జగన్ పార్టీకి ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు మరియు గిరిజనులు భారీ సంఖ్యలో మద్దతు తెలిపారు.

ఒకవేళ డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరిస్తే ఆ పదవిని గిరిజన మహిళకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.గిరిజన మహిళకు ఆ పదవిని ఇస్తే ఎలాంటి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నారు. పార్లమెంటులో అధికార పక్షానికి స్పీకర్ పదవి, విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది.
AP CM గా తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటున్న వైయస్ జగన్ ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: