మడమ తిప్పేది లేదు లక్ష్యం ఎంత పెద్దదైనా సరే సాధిస్తానని జగన్ అనేక సార్లు చెప్పుకొచ్చారు.  చెప్పినట్టుగానే అనుకున్నది సాధించారు.  అది అతిపెద్ద లెవల్లో.. భారీగా విజయం సాధించారు జగన్.  గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించి ఎవరికి సాధ్యంకాని అంకెలను సొంతం చేసుకున్నారు.  

అయితే, ఓ విషయంలో జగన్ మాట ఇచ్చి తప్పినట్టు తెలుస్తోంది.  గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజక వర్గంలో మర్రి రాజశేఖర్ 2019 లో పోటీ చేయాలి. కానీ, జగన్ ఆ సీటును ఎన్ఆర్ఐ విడదల రజినీకి కేటాయించాలని అనుకున్నారు.  ఆమెకు సీటు ఇవ్వాలని అనుకున్నట్టు జగన్ చెప్పాడు.  

దీంతో మర్రి రాజశేఖర్  కొంతఅసంతృప్తిని వ్యక్తం చేశారు.  అయితే, జగన్ మర్రి రాజశేఖర్ కు హామీ ఇచ్చారు.  ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే... మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని చెప్పారు.  దీంతో ఆయన తన సీటును విడదల రజినీకి త్యాగం చేశారు.  

పత్తిపాటి పుల్లారావు వంటి ఘనుడిపై విజయం సాధించేలా కృషి చేశాడు.  వైకాపా ఎన్నికల్లో భారీ విజయం సొంతం చేసుకుంది.   ఈ విషయం తరువాత మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఖాయం అనుకున్నారు.  అందరు వెళ్లి ఆయనకు అభినందలు కూడా తెలిపారు.  చివరకు సామాజిక న్యాయం పేరుతో మర్రి రాజశేఖర్ కు పదవి దక్కకపోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: