దేశవ్యాప్తంగా మోడీ గాలి మరోసారి వీయడంతో ఈసారి గతంలో కంటే భారీ మెజారిటీ వచ్చింది.  2014లో బీజేపీ 287 స్థానాలు గెలుచుకుంటే.. ఈసారి ఏకంగా 303 స్థానాల్లో విజయం సాధించి మరింత బలం పెంచుకుంది.  ఉత్తరప్రదేశ్ లో కొంతమేర బలం తగ్గినా.

ఆ బలాన్ని పశ్చిమ బెంగాల్ లో పెంచుకొని విజయం సాధించింది.  పశ్చిమ బెంగాల్ లో 2014 లో కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలుపొందగా.. ఈసారి ఏకంగా 18 స్థానాల్లో విజయం సాధించి తృణమూల్ కు షాక్ ఇచ్చింది. మరో రెండేళ్లలో బెంగాల్ కు ఎన్నికలు జరగబోతున్నాయి.  

292 స్థానాలున్న బెంగాల్లో ఎలాగైనా 250 స్థానాలు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకొని బీజేపీ మిషన్ ను స్టార్ట్ చేసింది.  మిషన్ 250 ని స్టార్ట్ చేసిన బీజేపీ సంస్థాగతంగా బలం పెంచుకోవడాని పావులు కదుపుతోంది.  రెండేళ్లలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్టీ వ్యూహాలను ప్రారంభించింది.  

అమిత్ షా బెంగాల్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు.  ఎలాగైనా మమతా సర్కారును గద్దె దించాలనే లక్ష్యంతో ఆయన పని స్టార్ట్ చేశారు.  బెంగాల్ ఆత్మగౌరవం అనే నినాదంతో గత పదేళ్లుగా మమతా అధికారంలో ఉన్నది.  కానీ, ఇప్పుడు అక్కడ ఆ పరిస్థితి కనిపించడం లేదు.   అభివృద్ధికి దూరంగా ఉండటంతో అక్కడి ప్రజలు వలస వెళ్తున్నారు.  దీన్ని గుర్తించిన బీజేపీ, బెంగాల్ అభివృద్ధి, జాతీయవాదం పేరుతో ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు.  మరి ఈ ప్రయత్నం ఫలిస్తుందా... చూద్దాం.  


మరింత సమాచారం తెలుసుకోండి: