ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి టిడిపి అభిమాని అంతరంగంలో ఉన్న ప్రశ్న ఒక్కటే.. బాబు తరువాత ఎవరు తెలుగుదేశం పార్టీని లీడ్ చేయబోతున్నారు.  బాబుకు ఇప్పటికే వయసు పైబడింది.  అటు జగన్ చిన్నవయసులోనే పార్టీని స్థాపించి అధికారంలోకి అచ్చరు.  

పాలన విషయంలో జగన్ దూకుడును ప్రదర్శిస్తున్నాడు. హామీల విషయంలో కూడా అదే దూకుడును ప్రదర్శిస్తున్నాడు.  మరి ఈ దూకుడును అందుకోవాలి అంటే బాబుకు వళ్ళగాని పని.  మరి ఈ బాధ్యతను ఎవరికీ అప్పగించాలి.  దానికి సమర్ధవంతమైన నాయకుడు ఎవరు.  

సగటు తెలుగుదేశం పార్టీ అభిమాని కూడా ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని, అప్పుడే పార్టీ తిరిగి బలపడుతుందని అంటున్నారు.  తారక్ లేకుంటే పార్టీ మనుగడ కష్టం అని అంటున్నారు.  బాబు మనసులో ఏముందో తెలియాలి.  

ఇప్పటికిప్పుడే తారక్ రాజకీయాల్లోకి వచ్చేలా కనిపించడం లేదు.  సినిమాలపైనే ఆయన దృష్టి ఉంది.  టిడిపికి మరో ఆప్షన్ కూడా ఉంది.  అదే బాలకృష్ణ.  బాలకృష్ణకు కొన్ని రోజులపాటు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని టిడిపి నేతలు అంటున్నారు.  మరి బాబు ఈ దిశగా ఆలోచిస్తారా చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: