రాజకీయాలు అనేవి 20 20 క్రికెట్ మ్యాచ్ లాంటివి..  విజయం ఎప్పుడు ఎవరివైపు ఉంటుందో చెప్పలేం.  ఎన్నికల సమయంలో ఎంచుకునే సీటు, ఉండే పార్టీ చాలా ముఖ్యం.  ఎన్నికల వేవ్ ఎటువైపు ఉందొ సరిగ్గా అంచనా వేయాలి.  అలా వేయగలిగినపుడు సదరు అభ్యర్థి విజయం సాధించగలుగుతారు.  

లేని పక్షంలో ఓటమి వాళ్ళను పలకరిస్తుంది.  ఓడిపోయే పార్టీలో ఉంది ఎంత ప్రయత్నించినా ఉపయోగం ఉండదు కదా.  ఇప్పుడు పంచకర్ల రమేష్ విషయంలో అదే జరిగింది.  ఈయన గంటా శ్రీనివాస రావుకు ప్రియ మిత్రుడు.  గంటా, కంచకర్ల, ముత్తంశెట్టి లు 2009 లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 

ఈ ముగ్గురు విజయం సాధించారు.  మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేయగా ముగ్గురు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు.  2014 ఎన్నికల్లో ఈ ముగ్గురు టీడీపీలో చేరారు.  ముగ్గురు గెలిచారు.  2019 దగ్గరికి వచ్చే సరికి తారుమారైంది.  గంటా శ్రీనివాసరావు టిడిపిలోనే ఉన్నారు.  

ముత్తంశెట్టి వైకాపాలో చేరి భీమిలి నుంచి పోటీ చేసి విజయం సాధించాడు.  మొత్తంశెట్టితో పాటు కంచకర్ల కూడా వైకాపాలోకి వస్తారేమో అనుకున్నారు.  ఒకవేళ కంచకర్ల వైకాపాలోకి వస్తే... ఆయనకు అమలాపురం నుంచి ఎంపీ సీటు ఇచ్చేందుకు సిద్ధం అయ్యింది వైకాపా.  గంటా మాట విని కంచకర్ల టీడీపీలోనే ఉండి పోవడంతో భారీ నష్టం వాటిల్లింది.  కంచకర్ల వైకాపా అభ్యర్థిపై భారీ ఓటమిని చవిచూశారు.  ముత్తంశెట్టి మాట విని వైకాపాలో చేరిఉంటే అమలాపురం నుంచి ఎంపీగా గెలిచేవారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: