ఈరోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో ఎవరు ఎలా మాట్లాడబోతున్నారు అన్నది సస్పెన్స్ గా మారింది.  క్యూరియాసిటి కూడా మొదలైంది.  ఎందుకంటే, మొదటిసారి వైకాపా అధికారంలోకి వచ్చింది.  మంత్రిగా అంతకు ముందు ఎలాంటి అనుభవం లేని జగన్, ఏకంగా ముఖ్యమంత్రి చైర్ లో కూర్చున్నాడు.  

అయన ఆ పదవిలో ఎలా  ప్రవర్తిస్తాడు ఎలాంటి  నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై  మొన్నటి వరకు  పలు అనుమానాలు ఉండేవి.  ఇప్పుడు ఆ అనుమానాలు లేవు.  పాలనా విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు.  ఇదే తెలుగుదేశం పార్టీకి పెద్ద సవాల్ గా మారింది.  

అసెంబ్లీలో తన వాయిస్ కంటే ఎమ్మెల్యేల వాయిస్ ఎక్కువగా వినిపించాలని, అధికార పక్షంలో ఉన్న నాయకులకు ధీటైన సమాధానం చెప్పడంతో పాటు వాళ్ళను ఇబ్బంది పెట్టె ప్రశ్నలు వేయాలని బాబు పార్టీ నాయకులకు సూచించారు.  

నేతలపై దాడుల విషయంలో స్పందిస్తూ.. పార్టీ కార్యకర్తలకు మనోధైర్యం చెప్పాలని వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వాలని బాబు ఎమ్మెల్యేలకు సూచించారు.   సో, అసెంబ్లీలో బాబు కంటే మిగతా  ఎక్కువగా  ఉండబోతుంది అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: