నవ్యాంధ్రప్రదేశ్ లో రెండవ సారి ఎన్నికై ప్రభుత్వం ఏర్పాటు చేసిన యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ పార్టీ నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం బుధవారం ఉదయం 11.05 గంటలకు 15వ శాసనసభ తొలి సమావేశం ప్రారంభమైంది. ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన వెంకట అప్పలనాయుడు సభాపతి స్థానంలో ఆసీనులయ్యారు. జాతీయగీతంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకోగానే అసెంబ్లీ ద్వారం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌కు పూర్ణకుంభంతో వేదపపండితులు స్వాగతం పలికారు. అనంతరం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభలో బుధవారం అడుగుపెట్టారు.

అద్వితీయమైన ప్రజాదరణ ఉన్న నేత సభా నాయకుడి స్థానాన్ని అధిష్టించడం రాష్ట్ర చరిత్రలో ఇది మూడోసారి. గతంలో ప్రజా ముఖ్యమంత్రులుగా ఎన్టీ రామారావు, వైఎస్‌ రాజశేఖరరెడ్డి సభా నాయకులుగా రాష్ట్ర శాసనసభకు వన్నె తెచ్చారు. మళ్లీ కొత్త చరిత్రను లిఖిస్తూ వైఎస్‌ జగన్‌ అద్వితీయమైన ప్రజాదారణతో పార్టీని విజయపథంలో నడిపించి ప్రజా ముఖ్యమంత్రిగా శాసనసభలో సభానాయకుడి స్థానాన్ని అలంకరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: