కాంగ్రెస్ పార్టీ 2019 లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో ఘోరపరాజయం మూటగట్టుకుంది.కాంగ్రెస్ పార్టీ పరాభవం ఏ రేంజ్ లో ఉంది అంటే తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఓటమిపాలైంది.దీంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ మే25 న తన పదవికి రాజీనామా చేశారు.అయితే CWC మాత్రం అతని రాజీనామాను తిరస్కరించింది.అయినా కూడా రాహుల్ గాంధీ పట్టువీడడం లేదు.తన రాజీనామాకే కట్టుబడి ఉన్నారు.

ఏం చేయాలో అర్థం కాని కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది.దీనిలో భాగంగా కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ని ప్రకటించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.ఎవరిని నియమించాలనే విషయంపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నలుగురు పేర్లు ఇప్పుడు హల్ చల్ చేస్తున్నాయి. 

ఆ నలుగులు వ్యక్తులు ఎవరు అంటే ఒకరు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మరో రాజస్థాన్ మంత్రి సచిన్ పైలట్, మరొక వ్యక్తి మధ్యప్రదేశ్ కు చెందిన జ్యోతిరాదిత్యసింధియా, ఇంకొక వ్యక్తి కాంగ్రెస్ పార్టీ వారసురాలైన ప్రియాంక గాంధీ వాద్రా.
వర్కింగ్ ప్రెసిడెంట్ గా వీరిలో ఎవరైనా ఒక నియమించి రాహుల్ గాంధీని పార్టీ పటిష్టతకు కృషి చేయాల్సిందిగా కాంగ్రెస్ అధిష్టానం కోరనుంది అన్నట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రచారంలో ఉన్న నలుగురు కాంగ్రెస్ పార్టీకి వీర విధేయ లే కాకుండా ఇదివరకే తమకంటూ ఒక గుర్తింపును పొందారు.
అశోక్ గెహ్లాట్ కు రాజకీయంగా అనుభవం ఉండడమే కాకుండా ఇదివరకే పీసీసీ ప్రెసిడెంట్ గా అనుభవం ఉండటం మరియు ముఖ్యమంత్రి గా పనిచేసిన అనుభవము ఉండటం కలిసి వచ్చే అంశం.అయితే లోక్సభ కు జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్ లో పార్టీ ఘోర పరాజయం పాలవడం ఆయనకు మైనస్.
సచిన్ పైలట్ యువకుడే కాకుండా ఆయన మాజీ యూనియన్ మినిస్టర్ కొడుకుగా మంచి పేరే ఉంది.2018 రాజస్థాన్ ఎన్నికలలో ఆయన పార్టీని నడిపించిన తీరు అందరిని ఆకట్టుకుంది.

ప్రచారంలో ఉన్న మరొక వ్యక్తికి జ్యోతిరాదిత్య సింధియా కూడా యువకుడు మరియు రాహుల్ గాంధీకి సన్నిహితుడు కావడం కలిసి వచ్చే అంశం.కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈయనకు కూడా మైనస్ గా మారాయి. ఇటీవలే పూర్తిస్థాయి రాజకీయ ఆరంగ్రేటం చేసిన ప్రియాంక గాంధీ వాద్రా పై కాంగ్రెస్ పార్టీ భారీగా ఆశలు పెట్టుకుంది.అచ్చం నాయనమ్మ లాంటి పోలికలతో ఉన్న ఆమెను అందరూ అంగీకరిస్తారు, ఆదరిస్తారు అని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తల్లి మరియు సోదరుడికి మాత్రమే ప్రచారం చేసిన ప్రియాంక ఇటీవల ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ గా వ్యవహరించారు. కానీ ఉత్తరప్రదేశ్ లో పార్టీ ఘోరపరాభవం ఆమెకు కూడా పెద్ద మైనస్ గా మారే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

వీరు మాత్రమే కాకుండా కాంగ్రెస్ సీనియర్ నేతలైన జైరాం రమేష్, అహ్మద్ పటేల్, గులాంనబీ ఆజాద్ మరియు దిగ్విజయ్ సింగ్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తుంది.కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: