కబ్జాలు, బలవంతపు వసూళ్లతో కోడెల ఫామిలీ జనాన్ని దోచేశారని ఫిర్యాదుల వెల్లువ .. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించే ఏ నాయకుడైన సహచర మంత్రులు , శాసన సభ్యుల కంటే హుందాగా , ఒక హోదాతో గౌరవ ప్రధంగా వ్యవహరించాలి. అయితే గత టి డి పీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన కోడెల శివ ప్రసాద్ ఆ హోదాకు మచ్చతెచ్చినట్టు అనేక సంఘటనలు రుజువుచేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ వద్దకు వెళ్లి ఆయన తన హోదాను మరచి వ్యవహరించినట్టు విమర్శలున్నాయి. 


2019 జరిగిన ఎన్నికల్లో ఆయన నియోజక వర్గంలోని ఒక పోలింగ్ బూత్ వద్దకు వెళ్లగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు తనపై దాడి చేసారని ఆయన చెప్పడం సిగ్గుచేటని అప్పట్లోనే పలువురు రాజకీయ విశ్లేషకులు ఆరోపించారు. వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉన్న విషయం తెలిసి, ఆయన తన అనుయాయులతో ఓటింగ్ మేనేజ్ చేయాలనుకోవడం అవివేకం అని దుయ్యబట్టారు. 


కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నంత కాలం ఆయన కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్మి అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు ఇటీవల నరసారావుపేట పోలీస్ స్టేషన్కు పిర్యాదులు అందడం వారి అక్రమాలకు పరాకాష్టగా నిలుస్తున్నాయి. అమాయకుల నుంచి భారీ స్థాయిలో అక్రమ వసూళ్లు చేశారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: