క్యాబినెట్ విస్తరణ రోజునే ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భర్తీచేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ముగ్గుర్ని ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, తొలుత విప్‌గా నియమించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారధిని తొలిగించారు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి‌లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు. పార్థసారధిని విప్ పదవి నుంచి తొలగించడానికి కారణం ఏంటనే చర్చ సాగుతోంది. ఆయనకు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారా? అని చర్చించుకుంటున్నారు

క్యాబినెట్ విస్తరణ రోజునే ప్రభుత్వ చీఫ్ విప్, విప్ పదవులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి భర్తీచేసిన విషయం తెలిసిందే. తాజాగా, మరో ముగ్గుర్ని ప్రభుత్వ విప్‌లుగా నియమించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, తొలుత విప్‌గా నియమించిన మాజీ మంత్రి కొలుసు పార్థసారధిని తొలిగించారు.

జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను,  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి‌లకు ప్రభుత్వ విప్‌లుగా అవకాశం కల్పించారు. పార్థసారధిని విప్ పదవి నుంచి తొలగించడానికి కారణం ఏంటనే చర్చ సాగుతోంది. ఆయనకు ఏదైనా బాధ్యతలు అప్పగిస్తారా? అని చర్చించుకుంటున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: