తెలంగాణ సీఎం కేసీఆర్   పొరుగు రాష్ట్రాలతో చక్కటి సంబంధాలు  కొనసాగిస్తున్నారు.  కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మహారాష్ట్ర తో స్నేహం సాగిస్తున్నారు.  ఆ  దోస్తీ తోనే చెట్టుకు కాలేశ్వరం ప్రాజెక్టు కు  లైన్ క్లియర్ చేశారు.

 

ఇప్పుడు ఆ ప్రాజెక్టు  ప్రారంభోత్సవానికి సిద్ధం   అయ్యింది. ఈ ప్రాజెక్టుకు ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కెసిఆర్ నిశ్చయించారు. త్వరలోనే విజయవాడకు స్వయంగా వెళ్లి జగన్ ను కెసిఆర్ ఆహ్వానిస్తారు.

 

ఈ నెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాల్సిందిగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానించారు. బుధవారం మద్యాహ్నం దేవేంద్ర ఫడ్నవీస్ తో సిఎం కేసీఆర్ మాట్లాడారు.  కేసీఆర్ ఆహ్వానాన్ని మన్నించిన దేవేంద్ర ఫడ్నవీస్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావడానికి అంగీకరించారు. 

 

త్వరలోనే స్యయంగా ముంబై వెళ్ళి దేవేంద్ర ఫడ్నవీస్ ను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.  ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవం వేళ  ఓ వైపు జగన్ మరోవైపు ఫడ్నవీస్..  మధ్యలో కేసీఆర్..  అంటే ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు అన్నమాట.  ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మంచితనం గా ఉంటే ఎంత లాభం ఉంటుందో ఈ ప్రాజెక్టు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: