ఆంధ్రప్రదేశ్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి నగరి ఎమ్మెల్యేగా గెలిచారు. మొదటి నుంచి దుందుడుకు స్వభావం..ఎవరినీ లెక్కచేయని తనం..సీఎం జగన్ వెంట ఎప్పుడూ ఓ ఆడపడుచులా ఉంటూ ముందుకు సాగిన రోజాకి ఆయన కేబినేట్ లో చోటు దక్కలేదు.  దాంతో సోషల్ మీడియాలో రక రకాల వార్తా కథనాలు వెలువడ్డాయి.


 తాజాగా  వైసీపీ నగరి ఎమ్మెల్యే రోజాను ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా ముఖ్యమంత్రి జగన్ నియమించిన సంగతి తెలిసిందే.. తనకు ప్రాధాన్యత గల పదవి దక్కడంపై రోజా ఆనందం వ్యక్తం చేశారు. తనపై నమ్మకం ఉంచి, పదవిని ఇచ్చిన జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని తెలిపారు. తనకిచ్చిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు.


వివిధ సామాజికవర్గాల మధ్య బ్యాలన్స్ చేసే నేపథ్యంలో, మంత్రి వర్గంలో స్థానం లభించకపోవడంతో రోజా మనస్తాపానికి గురైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా ఆమెకు మద్దతుగా పలువురు స్పందించారు. దీంతో ఆమెను బుజ్జగించిన జగన్..చివరకు ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ పదవిని ఇచ్చారు. వాస్తవానికి ఏపీఐఐసీ, ఆర్టీసీ, మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్లలో ఏదో ఒకటి ఎంచుకునే నిర్ణయాన్ని రోజాకు జగన్ ఇవ్వగా... నిర్ణయాన్ని జగన్ కే ఆమె వదిలేసినట్టు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: