ముఖ్యమంత్రి జగన్ నామినేటెడ్ పోస్టుల భర్తీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.  ఇటీవలే మంత్రివర్గాన్ని విస్తరించిన జగన్..  అసంతృప్తులకు నామినేటెడ్ పదవులు అప్పగిస్తున్నారు.  మంత్రివర్గంలో  కొందరు  కీలక నేతలకు కూడా  అవకాశం దక్కలేదు.

ఇప్పుడు అలాంటి నేతలకు కీలక పదవులు అప్పగిస్తున్నారు.  తాజాగా తుడా చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని నియమించారు .  జగన్ కు అత్యంత  సన్నిహితుడిగా గా పేరున్న   చెవిరెడ్డి  వాస్తవానికి మంత్రి పదవి ఆశించారు.

సామాజిక వర్గాల కూర్పు కారణంగా అది సాధ్యపడలేదు.  పరిస్థితి అర్థం చేసుకున్న  చెవి రెడ్డి  తుడా చైర్మన్ పదవితో సంతృప్తి చెందుతున్నారు.  చిత్తూరు జిల్లాలో తుడా చైర్మన్ పదవి ప్రతిష్టాత్మకమైనది.

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో భాస్కర్ రెడ్డి కి  ఈ పదవి ద్వారా  చక్కటి   ప్రాధాన్యత లభిస్తుంది .  ప్రస్తుతానికి తుడా చైర్మన్ గా సంతృప్తి పడుతున్న   చెవిరెడ్డి భవిష్యత్తులో  తనకు మంత్రి పదవి తప్పకుండా  లభిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు.  తుడా చైర్మన్ గా తిరుపతి అభివృద్ధిలో  కీలక పాత్ర పోషిస్తే జగన్ మెప్పు పొందే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: