అవును నిజంగా నిజమే. సీనియర్ రాజకీయ నేతగా టిడిపిలో కూడా చాలా చురుకుగా ఉండేవారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సిఎం అయ్యారు. కానీ ఆమెతో జగన్ కు తలనొప్పులు మొదలైనట్లు సమాచారం. ఆ తలనొప్పిని ఎలా వదిలించుకోవాలో అర్ధంకాక జగన్ తలపట్టుకున్నారట.

 

ఇంతకీ విషయం ఏమిటంటే నన్నపనేని రాజకుమారి అంటే పెద్దగా పరిచయం అవసరం లేదు. టిడిపి ప్రభుత్వంలో  ఆమె మహిళా కమీషన్ కు ఛైర్ పర్సన్ గా ఉన్నారు. అంటే ఇప్పటికీ ఆమే ఛైర్ పర్సన్ గా కంటిన్యు అవుతున్నారు లేండి. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నేరుగా వెళ్ళి మరీ అభినందించి వచ్చారు.

 

అభినందించటం వరకూ బాగానే ఉంది. కానీ ఇక్కడే పెద్ద ట్విస్టు మొదలైంది. ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది టిడిపి నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ నన్నపనేని మాత్రం తన పదవికి రాజీనామా చేసేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.

 

పైగా ప్రభుత్వం మారింది కదా అని తనను రాజీనామా చేయవద్దని జగన్ ను నేరుగానే అభ్యర్ధించారట. ప్రభుత్వం మారిందని తనను తొలగించవద్దని జగన్ ను రాజకుమారి గట్టిగానే అడిగారట. మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ పదవికి ప్రభుత్వం మారటానికి ఏమీ సంబంధం లేదని నన్నపనేని బాహాటంగానే చెబుతున్నారు.

 

నన్నపనేని వైఖరే ఇపుడు జగన్ కు ఇబ్బందిగా మారింది. నిజానికి ప్రభుత్వం మారగానే ప్రభుత్వం ద్వారా వచ్చిన పదవులకు రాజీనామాలు చేసేస్తే నేతలకు గౌరవంగా ఉంటుంది. లేకపోతే కొత్త ప్రభుత్వమే ఆర్డినెన్సు ద్వారా అందరిని తొలగిస్తుంది. ఆ విషయం నన్నపనేనికి తెలీందేమీ కాదు. అయినా తనను ఛైర్ పర్సన్ పదవిలో కొనసాగించమని జగన్ ను అడగటంలో అర్ధమేలేదు. మరి రాజకుమారి విషయంలో జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: