అవును! తాజా ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డాల‌ని వెయ్యి దేవు ళ్ల‌కు మొక్కుకున్న ముఖ్య నేత‌ల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ముఖ‌మైన‌వారు. ఎన్నిక‌ల‌కు ముందు, త‌ర్వాత కూడా ఆ యన వైసీపీ ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని కోరుకున్నారు. ఇక‌, ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డుతోంద‌ని ఎ న్నిక‌ల ఫ‌లితాల్లో సంకేతాలు వెలువ‌డ‌గానే తొలి ఫోన్ ఆయ‌న నుంచే జ‌గ‌న్‌కు వ‌చ్చింది. త‌ర్వాత జ‌గ‌న్ సీఎం కాకుం డానే త‌న ఇంటికి ఆహ్వానించి కుటుంబ స‌మేతంగా జ‌గ‌న్‌కు అభినంద‌న‌లు తెలిపారు కేసీఆర్‌. 


ఇక‌, జ‌గ‌న్ ప్ర‌మాణ స్వీకారం రోజు స్వ‌యంగా విజ‌యవాడ వ‌చ్చి త‌న అభినంద‌న‌లు తెలిపారు. ఏపీకి అన్ని విధాలా సాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. జ‌గ‌న్ కూడా తెలంగాణ విష‌యంలో చాలా సానుకూలంగా స్పందించారు. ప‌క్క‌రాష్ట్రా ల‌తో స్నేహంగా ఉంటేనే మ‌న‌కు మంచిద‌ని ఆయ‌న కూడా చెప్పారు. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఇఫ్తార్ విందులో ఇద్ద‌రూ పాల్గొన్నారు. అక్క‌డ కూడా జ‌గ‌న్‌కు కేసీఆర్ పెద్ద‌పీట వేశారు. ఇలా ఇద్ద‌రూ క‌ల‌సి న‌డుస్తున్న క్ర‌మంలో మ‌రో అరుదైన ఘ‌ట్టం త్వ‌ర‌లోనే ఆవిష్కృతం కానుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. 


కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఆవిష్కరణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పనులు అతి త్వరలో పూర్తి కానున్నాయి. జూన్ 21న ప్రాజెక్టును ప్రారంభించేందుకు తెలంగాణ సర్కారు సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించాలని కేసీఆర్ నిర్ణయించారు. జగన్‌ను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించేందుకోసం కేసీఆర్ త్వరలోనే విజయవాడ వెళ్లనున్నారని మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే.. ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య బంధం మ‌రింత బ‌ల‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: