- బ్రెయిన్‌తో కాదు హృద‌యంతో చేయాలి.. అప్పుడే స‌త్ప‌లితాల‌ను ఇస్తుంది..
- స‌మాచార‌, ర‌వాణా శాఖ‌ల మంత్రి పేర్ని నాని..
ప్రజలకు అందుబాటులో ఉంటూ,  ప్ర‌జాసేవ చేయ‌డ‌మే నా ల‌క్ష్యం అని స‌మాచార శాఖ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని) అన్నారు. కొత్త ప్రభుత్వం స‌భ‌లో కొలువు తీరిన వేళ ఆనందోత్స‌వాల మ‌ద్య ఎమ్మెల్యేలంతా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఈ రోజు తీసుకున్న నిర్ణ‌యం చారిత్రాత్మ‌కం అయినద‌ని ఇది ఎంతో  హ‌ర్ష‌ణీయం అన్నారు.


ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఎన్నో సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ దేశం అంతా రాష్ట్రం వైపు చూసే విదంగా చేస్తున్నార‌ని అన్నారు. ఆర్టీసీ సంస్థ‌ను మ‌ళ్లీ ప్ర‌భుత్వంలోకి విలీనం చేసుకోవ‌డం చారిత్రాత్మ‌క నిర్ణ‌యం అని దీనిని అక్క‌డున్న కార్మికులంతా ఎంతో సంతోషాన్ని వ్య‌క్తం చేస్తున్నార‌ని, ఆర్టీసీ అప్పుల్లో ఉందా... పాత బ‌స్సుల్లో న‌డుపుతున్నారా అనేది ముఖ్యం కాద‌ని దేశంలోనే అత్యున్న‌త సంస్థ‌గా ఆర్టీసీని త‌యారు చేసే బాధ్య‌త నాది అని జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి పేర్కొన్నార‌ని అన్నారు. 


అలాగే రాష్ర్టంలోని జ‌ర్న‌లిస్టులంద‌రికి అక్రిడేష‌న్లు డిసెంబ‌రు వ‌ర‌కు పొడిగించ‌నున్న‌ట్లు తెలిపారు. విలేక‌రుల‌కు మంచి చేయాల‌న్న ఉద్దేశ్యం నాకు ఉంద‌ని వారి క‌ష్టాల‌ను ద‌గ్గ‌ర‌గా చూసిన వ్య‌క్తిగా రాబోయే కాలంలో ముఖ్య‌మంత్రితో మాట్లాడి కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటామ‌ని తెలిపారు. అలాగే అంద‌రికి అందుబాటులో ఉంటూ పాత్రికేయుల మిత్రులకు ఇళ్ల స్థ‌లాలు మ‌రికొన్ని సౌక‌ర్యాల క‌ల్ప‌న‌కు మా ప్ర‌భుత్వం న‌డుం బిగించ‌బోతుంద‌ని మంత్రి పేర్ని నాని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: