తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిస్థితి  ఇపుడు ఎలా ఉందంటే నలభయ్యేళ్ళ రాజకీయ జీవితం  అన్న ట్యాగ్ తప్ప మళ్ళీ మొదటికి వచ్చినట్లుంది. కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మిగిలారు. అలా అని గుండె మీద చేయి వేసి పడుకుందామన్నా  అది జరిగే పనిలా కనిపించడంలేదు.


ఏ ఎమ్మెల్యే ఎపుడు గోడ దాటేస్తాడోనని భయం పట్టుకుంది. ఇక కమలం పార్టీ అపుడే  ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసింది. హైదరాబాద్లోని ఒక హొటల్లో కూర్చుని మరీ తెలుగు వాడైన రాం మాధవ్ తన పని కానిచ్చేస్తున్నారు. ఆలస్యమైతే ఆశాభంగం వచ్చినవారు వచ్చినట్లే చేరిపోండంటూ పిలుపులతో వలపు ఒలకబోస్తున్నారు.


దాంతో ఆయన బస చేసిన హొటల్ వద్ద పసుపు తమ్ముళ్ళే ఇపుడు ఎక్కువగా కనిపిస్తున్నారట.  ముందు తెలంగాణా తమ్ముళ్ళు వంతు. వారిలో చాలా మంది రాం మాధవ్ ముందుకు వెళ్ళి బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు రెడీపోతున్నారు. తెలంగాణా టీడీపీ నేత లంకల దీపక్ రెడ్డి ఓ బాంబు పేల్చారు.


వెళ్తున్న వారిలో టీడీపీ తెలంగాణా నేతలే కాదు, ఏపీ నేతలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీలు కొంతమంది బీజేపీకి టచ్ లో ఉన్నారని పోతూ పోతూ ఈ పసుపు తమ్ముడు గట్టి షాక్ ఇచ్చాడు. అంటే ఇపుడు చూసుకుంటే ఎంతమంది బాబు గారి వెనకాల అసెంబ్లీలో కూర్చుటారు అన్నది కూడా డౌటే. అసలు అరకొర సీట్లతో ప్రతిపక్షంలోకి వచ్చిన చంద్రబాబుకు ఆ ప్రతిపక్ష హోదా అయినా దక్కనిస్తారా అన్నది చూడాలి మరి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: