భద్రాచలంను ఏపికి కేటాయించే ప్రతిపాదన గురించి ఇటివల సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు అలాంటి ఆలోచనే లేదని కొట్టి పారేశారు. సాక్షాత్తు ఏపీలోనే ఆయన ఈ కామెంట్లు చేశారు.

 

తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలాన్ని త్వరలోనే ఏపిలో విలీనం చేయనున్నారనే ప్రచారం ఇటీవల మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇటివల రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో తెలంగాణ సిఎం కెసిఆర్‌, ఏపి సిఎం జగన్‌ సమావేశం సందర్భంగా ఈ విషయం చర్చకు రాగా, సిఎం కెసిఆర్‌ అందుకు అంగీకరించినట్టు ప్రచారం జరిగింది.భద్రాచలాన్ని ఏపీలో విలీనం చేసే విషయంలో కేంద్రం కూడా సానుకూలంగానే ఉన్నట్టు ఇందులో పేర్కొన్నారు.

 

అయితే...తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న  దేవాదాయ శాఖ మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలంను ఏపికి కేటాయించే ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు అభివృద్ధి కోసం కలసి పని చేస్తున్నారని మంత్రి అన్నారు. 5 సంవత్సరాలుగా హైద్రాబాద్ లో నిరుపయోగంగా ఉన్న ఏపీ భవనాలను తెలంగాణకు అప్పగించడం అభినందనీయని మంత్రి  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ  కార్యక్రమానికి  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ తో పాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ లను సీఎం కేసీఆర్  ఆహ్వానించనున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: