ఇండియా పై మరొకసారి పాకిస్తాన్ తన అక్కసు వెళ్ళగక్కు కుంది.ఎప్పుడూ కాల్పుల ఒప్పందాలను ఉల్లంఘించే పాకిస్తాన్ ఈసారి తన వక్రబుద్ధిని టీవీ ఆడ్ ద్వారా చూపించింది.IAF వింగ్ కమాండర్ అభినందన్ ను టార్గెట్ గా చేసేసుకుంది.పుల్వామా దాడుల ఘటన తర్వాత భారత్ పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై  ఎయిర్ స్ట్రైక్స్ చేసింది.

ఆ తర్వాత పాకిస్తాన్ యుద్ధ విమానాలు ఇండియా పై దాడి చేయడానికి ప్రయత్నించాయి.ఫిబ్రవరిలో తన విమానంతో పాకిస్తాన్  యుద్ధ విమానాన్ని నేలకూల్చిన అభినందన్ ఆ తర్వాత అనుకోకుండా పాకిస్తాన్తో దిగాడు.అక్కడ అతనిని పాకిస్తాన్ అధికారులు బందీలుగా పట్టుకున్నారు.దాదాపు 60 గంటలు బందీగా ఉన్నాడు.భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఒత్తిడి తెచ్చి అభినందన్ ను క్షేమంగా వరకు రప్పించింది. అప్పుడు అతను పాకిస్తాన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ధైర్యంగా "సారీ నేను  ఆ విషయాలను మీకు చెప్పలేను" అని తెలిపాడు.సరిగ్గా ఇదే మాటలను ఉపయోగించుకుంటూ పాకిస్తాన్ కు చెందిన ఒక టీవీ ఛానల్ రూపొందించింది.

ఈనెల 16న వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది.దీనిపై పాకిస్తాన్ కు చెందిన ఒక టీవీ సంస్థ ఒక యాడ్ ను రూపొందించింది.
యాడ్ లో అచ్చం అభినందన్ లాగే ఉన్న వ్యక్తిని చూపిస్తూ కొన్ని ప్రశ్నలు అడిగింది "టాస్ గెలిస్తే ఏం చేస్తారు,మ్యాచ్ ఆడే జట్టు 11లో ఎవరు ఉంటారు "అని అడిగారు.
దానికి సమాధానంగా అభినందన్ చెప్పిన "సారీ నేను  ఆ విషయాలను మీకు చెప్పలేను" అన్న మాటలను వెటకారం గా చూపించారు.

దీనిపై ఇండియా లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయివ్యక్తమవుతున్నాయి.పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని నిరూపించుకుంది  అని నెటిజన్లు విమర్శిస్తున్నారు.
దీనిపై పాకిస్తాన్ కోడలు అయినా భారత టెన్నిస్ స్టార్ సానియామీర్జా కూడా తీవ్రస్థాయిలో విమర్శించింది.ఇలాంటి చీప్ యాడ్ లు ఎవరు హర్షించరు అని ఆమె పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: