రాయలసీమలో భూమా ఫ్యామిలీకి మంచి పేరు ఉన్నది.  అప్పట్లో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు రాజకీయాల్లో చక్రం తిప్పారు.  శోభా నాగిరెడ్డి కారు ప్రమాదంలో మరణించిన తరువాత అంతా తారుమారైంది. శోభా నాగిరెడ్డి స్థానంలో ఆమె కూతురు అఖిల ప్రియా రాజకీయాల్లోకి వచ్చింది.  

రాజకీయాల్లోకి వచ్చిన భూమా అఖిల ప్రియా తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషించింది.  మంత్రిగా పనిచేసింది.  ఆమె తెలుగుదేశం పార్టీలో ఉన్న సమయంలోనే తండ్రి భూమా నాగిరెడ్డి మరణించారు.  ఆ స్థానంలో భూమా బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు.  

తెలుగుదేశం పార్టీలో ఉంటూనే అఖిల ప్రియా సొంత నాయకులపై ఫైర్ అవుతూ ఉండేది.  ఆళ్లగడ్డ నియోజక వర్గంలో నేతలు సహకరించడం లేదని అనేకమార్లు వాపోయింది.  కాగా, మొన్న జరిగిన ఎన్నికల్లో భూమా అఖిల ప్రియా ఓటమిపాలైంది.  భూమా కుటుంబానికి పట్టున్న ఆ ప్రాంతం నుంచి ఓడిపోవడం జీర్జించుకోలేని విషయం.  

ఇదిలా ఉంటె,  భూమా అఖిల ప్రియా ఇప్పుడు టిడిపిని వదిలి వైకాపాలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నది.  ఇప్పటికే ఈ అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టు సమాచారం.  గతంలో భూమా అఖిల ప్రియా వైకాపా టికెట్ పై గెలిచి.. టిడిపిలో జాయిన్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: