జమ్ము కాశ్మీర్ ...ఈ పేరు వింటేనే దేశంలోనే అత్యంత చల్లగా ఉండే ప్రాంతాలు గుర్తుకు వస్తాయి.కాశ్మీరు లోయలు చూడడానికి పర్యాటకులు ఎంతగానో ఇష్టపడుతుంటారు.కాశ్మీర్ పేరు చెప్పగానే కాశ్మీర్ ఆపిల్స్ గుర్తుకొస్తాయి.కానీ అలాంటి కాశ్మీర్లో రాజకీయాలు మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ గానే ఉంటాయి.అలాంటి కాశ్మీర్ ఎప్పుడు బాంబుల మోతలతో, బుల్లెట్ల తూటాలతో అట్టుడుకుతుంటుంది.

జమ్ము కాశ్మీర్ లో BJP-PDP సంకీర్ణ ప్రభుత్వం గతేడాది జూన్లో కూలిపోయింది.సంకీర్ణ ప్రభుత్వం నుండి బిజెపి బయటికి వచ్చేసింది.దీంతో డిసెంబర్ 2018 లో అక్కడ రాష్ట్రపతి పాలన విధించారు.జూన్ తో ఆ గడువు ముగుస్తుంది అందువల్ల మరొకసారి ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

జమ్ము కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది అయితే ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వర్గాలు తెలుపుతున్నాయి.ఈ ఏడాది ఆగస్టులో అమర్నాథ్ యాత్ర పూర్తయిన తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని ఈసీ తెలిపింది.భద్రతా కారణాల దృష్ట్యా అమర్నాథ్ యాత్ర అయిపోయిన తర్వాత నే ఎన్నికలు నిర్వహించాలి అనుకున్నట్లు తెలుపుతున్నారు.

పెద్ద ఎత్తున భక్తులు అమర్నాథ్ యాత్రను చేస్తారు కాబట్టి దారిపొడవునా పోలీసులు మరియు మిలిటరీ లను ఉపయోగించాల్సి ఉన్నందువల్ల, ఎలక్షన్లు ఈ నెల చివర్లో నిర్వహిస్తామని తెలిపారు.ఎలక్షన్ షెడ్యూల్ ని ఆగస్టు తర్వాత ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
లోక్ సభ ఎన్నికలలో కూడా పటిష్ట భద్రత నడుమ వివిధ దశలలో నిర్వహించిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: