ముస్లిం మహిళలకు రక్షణ కల్పించే విధంగా ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన "ట్రిపుల్ తలాక్"బిల్లును కేంద్ర క్యాబినెట్ మరొకసారి ఆమోదం తెలిపింది. బుధవారం మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ బిల్లును మొదటగా ఆర్డినెన్స్ ద్వారా  ప్రభుత్వం తీసుకు వచ్చింది.

దీనిని 16వ లోక్ సభ ఆమోదం కూడా తెలిపింది.రాజ్యసభ మాత్రం ఆమోదం తెలుపలేదు. రాజ్యసభలో జరిగిన చర్చలో భాగంగా బిల్లులో భర్తల పై క్రిమినల్ కేసులు మరియు శిక్ష కాలం మీద తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి.రాజ్యసభలో ప్రతిపక్ష బలం ఎక్కువ ఉండడం కారణంగా అప్పట్లో మోడీ ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదించుకోలేకపోయింది.

పార్లమెంటు నిబంధనల ప్రకారం లోక్ సభ ఆమోదం తెలిపిన రాజ్యసభలో ఆమోదం లేకుండా ప్రభుత్వం ఎన్నికలకు వెళితే ఆ బిల్లు చట్ట రూపం దాల్చదు.దీంతో కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరొకసారి బిల్లును కేబినెట్ ఆమోదించి లోక్ సభలో ప్రవేశపెట్టనుంది.

కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ "జూన్ 17న ప్రారంభమయ్యే మొదటి సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే పోతున్నట్లు తెలిపారు.బిల్లుకు చట్ట రూపం దాల్చడానికి ప్రతిపక్షాలు సహకరించవలసిందిగా కోరారు".


మరింత సమాచారం తెలుసుకోండి: