మంత్రి కూర్పు కాన్నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తున్న జ‌గ‌న్ కేబినేట్‌లో స్థానం ద‌క్క‌ని నేత‌ల‌కు కీల‌క ప‌ద‌వులు ఇస్తున్నారు. నిన్న రోజాకు ఏపీఐఐసీ ప‌ద‌వి ఇచ్చిన జ‌గ‌న్ నారాలోకేష్‌ను ఓడించిన ఆళ్ల‌కు కూడా అంత‌కంటె కీల‌క‌మైన ప‌ద‌విని సీఎం జ‌గ‌న్ ఇవ్వ‌నున్నారు.

 

తాజగా జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై పోటీ చేసి గెలుపొందారు వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి. లోకేష్ ను ఓడిస్తే మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పిన జ‌గ‌న్ కొన్ని రాజీకీయ స‌మీక‌ర‌ణాల వ‌ల్ల మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో తనకు మంత్రి పదవి వస్తుందని భావించినా ఆళ్ల కాస్త నిరాశ పడ్డారు. దీంతో ఇప్పుడు ఆయనను బుజ్జగించే పనిలో పడ్డారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డి.

 

ఇప్పటికే నగరి ఎమ్మెల్యే రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని ఖరారు చేశారు. ఇప్పుడు తాజాగా ఆళ్ల‌కు సీఆర్డీయే (కాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ పదవిని అప్పగించాలని నిర్ణయించినట్లు స‌మాచారం.మరో రెండు రోజుల్లో జగన్ ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకొనున్నట్లు సమాచారం. దీనిపై సీఎం అధికారులకు ఉత్తర్వులు వెలువడనున్నాయి.

 

రాష్ట్రాభివృద్ధిని వేగం చేసేలా ఐదు ప్రాంతీయ మండళ్లను ఏర్పాటు చేసి, పదవులు లభించని పార్టీ నేతలు ఐదుగురిని వాటికి చైర్మన్లుగా నియమించాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, మిగతా సీమ జిల్లాలకు ఈ మండళ్లు ఉంటాయని సమాచారం. ఏది ఏమైనా పార్టీకోసం ప‌నిచేసిన నేత‌ల‌కు జ‌గ‌న్ ఈ విధంగా న్యాయం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: