రాజకీయాల్లో చాణక్య నీతికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. శత్రువును దెబ్బ తీసేందుకు ఎన్నో ఎత్తుగడలు వేస్తుంటారు.. అయితే ఈ ఎత్తులు, చాణక్యం వెనుక నైతికత అంటూ ఒకటి ఉంటుంది. కానీ చాలా మంది నీతిలేని రాజకీయాలతో ఆ నైతికతను పట్టించుకోరు.


నైతికతలేని ఆ ఎత్తుగడలు అప్పటికి సత్ఫలితాలు ఇచ్చినా.. ఆ తర్వాత తలవంచుకునేలా చేస్తాయి. తాజాగా అదే జరిగింది. 2014 ఎన్నికల్లో దాదాపు 70 ఎమ్మెల్యేలు స్థానాలు గెలిచిన వైసీపీని దెబ్బ తీసేందుకు చంద్రబాబు ఎన్నో ఎత్తులు వేశారు. దాదాపు 23 మందిని తన పార్టీలోకి లాక్కున్నారు. 

కొందరికి మంత్రి పదవులు ఇచ్చారు. కానీ తాజా ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సీఎం వైఎస్ జగన్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ సూటిగా చంద్రబాబునుద్దేశిస్తూ ఆయన వైఖరిని ఎండగట్టారు. వేరు పెట్టి చూపిస్తూ జగన్ చంద్రబాబు తీరును కడిగిపారేశారు. 

అవునయ్యా.. నేను కూడా నీకు లాగా లాక్కునేదుంటే.. నీకు ప్రతిపక్ష హోదా కూడా వచ్చి ఉండేది కాదు.. అవునయ్యా.. తెలియకపోతే.. తెలుసుకో.. వాస్తవాలివి..నేను కూడా నీకులాగా ప్రలోభాలు పెట్టి ఉంటే.. నేను కూడా నీకులాగా మంత్రి పదవులిస్తా.. వచ్చేయ్యండని అంటే.. నేను కనుక డోరు తెరిస్తే.. ఎవరూ మిగలరు.. అని నేరుగా చంద్రబాబును విమర్శించారు.

జగన్ అలా నేరుగా పేరు పెట్టి.. వేలు చూపించి.. కడిగిపారేస్తుంటే.. పాపం 40 ఏళ్ల సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబు ఏమీ మాట్లాడలేక.. జీవం లేని నవ్వు నవ్వుతూ ఉండిపోయారు. ఒక రకంగా బిక్కచచ్చిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: