జగన్ సర్కార్ అధికారంలోకి వస్తుందంటే తమకు మంత్రి పదవి ఖయామని చాలా మంది భావించారు. దాదాపు వందమంది వరకూ ఎమ్మెల్యేలు ఏదో ఓ స్థాయిలో మంత్రి అయిపోదామని కలలు కన్నవారే. అయితే పాతికమంది వరకే అక్కడ అవకాశం ఉంది. దాంతో మిగిలిన వారు నోరు వెళ్ళబెట్టాల్సివచ్చింది.


ఈ నేపధ్యంలో తన తండ్రి  వైఎస్సార్  కాలం నాటి అభివ్రుధ్ధి బోర్డులకు జగన్ తెర తీశారు. ఏపీలో అయిదు అభివ్రుధ్ధి బోర్డులను నియామకం చేశారు. ఉత్తరాంధ్ర అభివ్రుధ్ధి బోర్డ్ చైర్మన్ గా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నియమితులయ్యారు.


గోదావరి జిల్లాల అభివ్రుధ్ధి బోర్డ్ చైర్మన్ గా తుని ఎమ్మెల్యే కాపు నాయకుడు దాడిసెట్టి రాజాని ఎంపిక చేశారు. గుంటూర్, క్రిష్ణా అభివ్రుధ్ధి బోర్డ్ చైర్మన్ గా మాజీ మంత్రి, బీసీ నేత అయిన కొలుసు పార్ధసారధి నియమితులయ్యారు.


అదే విధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల అభివ్రుధి బోర్డ్ కి చైర్మన్ గా కానాణి గోవర్ధన్ రెడ్డి నియమితులయ్యారు. రాయలసీమ అభివ్రుధ్ధి బోర్డ్ చేర్మన్ గా అనంత వెంకటరామిరెడ్డి నియమితులయ్యారు.  వీరికి మంత్రి హోదా తో పాటు అన్ని రకాల అధికార వైభోగాలు దక్కడంతో కొంతమంది మంత్రి పదవి రాని వారికి ఈ విధంగా చోటు లభించినట్లే.


మరింత సమాచారం తెలుసుకోండి: