నేడు జగన్ ఢిల్లీ పర్యటన ఎంతో ఆసక్తిని రేపుతోంది. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధుల విషయంలో ఇప్పటికే జగన్ ఎంతో వ్యహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజులపాటు జగన్ ఢిల్లీ పర్యటన సాగనుంది. ఇక జగన్ ఢిల్లీ పర్యటన నేపధ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఏపీ కి సంబంధించిన అభివృద్ధి పనుల గురించి చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా వైయస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో నిర్వహించి నీతి ఆయోగ్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు జగన్.


అయితే జగన్ ఢిల్లీ టూర్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందు ముఖ్యమంత్రిగా తాను చేస్తున్న ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించటానికి వెళ్లిన జగన్ ఇప్పుడు మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. కానీ ఈ సారి రాష్ట్రానికి కేంద్రం నుండి కావలసిన సహకారానికి సంబంధించి ఆయా అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించాలి అన్నదానిపై ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చిన జగన్ ఆయా అంశాలను ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయనున్నారు. 


అంతేకాదు నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొననున్న జగన్ ఏపీకి ప్రత్యేక హోదా నీతి ఆయోగ్ తో ముడిపడి ఉన్నందున ప్రత్యేక హోదా విషయంలో జగన్ ఒక నివేదికను తయారు చేసుకుని దానిని ప్రధాని నరేంద్ర మోడీకి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక శనివారం నాడు నిర్వహించే వైయస్సార్ పార్లమెంటరీ సమావేశం లోనూ జగన్ పాల్గొంటారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో జగన్ చర్చించనున్నారు. ఈనెల 17 నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ ప్రత్యేక హోదా అంశమే లక్ష్యంగా ఎంపీలు పోరాటం చేయాలని చెప్పే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: