జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు సిద్ధం అవుతున్నాడు.  ఒక్కో పధకాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాడు.  వైఎస్ పింఛన్ పధకం అమలు చేస్తున్నారు.  నెలకు 2250 రూపాయల చొప్పున పింఛన్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు.  అలాగే వైఎస్ రైతు భరోసా పధకం కింద నెలకు 50 వేల రూపాయలు ఇచ్చేందుకు జగన్ సిద్ధం అయ్యారు.  


అలాగే 4వేల రూపాయల సబ్సిడీ విత్తనాలు ఇస్తున్నారు.  వీటితో పాటు గ్రామాల్లో గ్రామ వాలంటీర్లను నియమిస్తున్న సంగతి తెలిసిందనే.  ఇలా వరుసగా పధకాలు ప్రకటిస్తూ అమలు చేస్తూ దూసుకుపోతున్న జగన్, రాజన్న బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ఈ పధకం ద్వారా చదువు మానేసిన పిల్లలను తిరిగి బడికి పంపించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. 


ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలకు అమ్మఒడి పధకం కింద 15 వేల రూపాయలు ఇవ్వబోతున్నట్టు జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ పధకం తక్షణమే అమలులోకి వచ్చినా.. జనవరి 26 వ తేదీన అమ్మఒడి పథకం కింద ప్రభుత్వం ప్రకటించిన 15వేల రూపాయలను ప్రభుత్వం వారి తల్లిదండ్రులకు ఇస్తామని చెప్పారు.  


రాష్ట్రంలో ప్రవైట్ స్కూల్స్ దందాను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.  ముఖ్యంగా నారాయణ వంటి విద్యాసంస్థలు ప్రీ స్కూల్ స్టేజిలోనే 20 వేల రూపాయల ఫీజును వసూళ్లు చేస్తున్నారట.  వీటి దందాను అడ్డుకొని, ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తీసుకొచ్చేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.  జగన్ ప్రవేశ పెట్టిన ఈ పథకం హిట్టయితే.. భవిష్యత్తులో జగన్ కు తిరుగుండదు అనడంలో సందేహం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: