వైఎస్ జగన్ మాట్లాడితే ఒక క్లారిటీ ఉంటుంది. ఆయన మాట తప్పడు, మడమ తిప్పడు, ఇది ఆయనకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ అటువంటి జగన్ సీఎం అయ్యాక కొంత మా ర్పు వచ్చింది. ఆయన విధానాల్లో దూకుడు వేగం అలాగే ఉన్నాయి. ప్రాక్టికాలిటీ కూడా జగన్ లో ఎక్కువగా ఉంది.


అయితే ప్రత్యేక హోదా వంటి వాటి విషయంలో జగన్ మాట కాస్తా తగ్గుతుందా అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.  జగన్ ప్రత్యేక హోదా పోరాటయోధుడు. ఆయన హోదా కోసం నాలుగేళ్ళ పాటు ఉద్యమం  చేశారు. అటువంటి జగన్ ఇపుడు అంటే సీఎం అయ్యాక గతంలో ఢిల్లీ వెళ్ళినపుడు మోడీకి మెజారిటీ ఉంది మన అవసరం లేదన్నట్లుగా మాట్లాడారు.


ఇపుడు తాజాగా ఢిల్లీ పర్యటనలో దేవుడి మీద భారం వేశారు. దేవుడి దయ ఉంటే హోదా తప్పకుండా వస్తుందని చెబుతున్నారు. జగన్ పార్టీకి 22 మంది ఎంపీలను నమ్మి జనం ఇచ్చారు. జగన్ హోదా తెస్తాడని, ఆ సత్తా ఆయనకే ఉందని కూడా ఇప్పటికీ నమ్ముతున్నారు. అయితే జగన్ పరిస్థితి చూసినా ఇబ్బందులు ఉన్నాయి.


మోడీ మాట వినరు. ఆయనకు ఏపీతో అవసరం లేదు. నిజానికి ఏపీకి కేంద్రంతో ఎంతో అవసరం ఉంది. ఆర్ధికంగా ఆదుకోవాల్సివుంది. దాంతో ఇటు లోటు రాష్ట్రం, అటు హోదా పోరాటం ఈ రెండింటినీ బ్యాలన్స్ చేసుకుంటూ జగన్ ముందుకు సాగాలి, ఈ టైంలోనే జగన్ నోటి వెంట ఇలాంటి షాకింగ్ కామెంట్స్ వస్తున్నాయా అనిపిస్తోంది. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: