ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణాలు ఏంటని ప్రజలను అడిగితే వంద కారణాలు చెప్పగలరు. కానీ బాబుగారికి ఇంకా కారణాలు తెలియడం లేదంటా .. ఇలా మాట్లాడితే ఇక పార్టీ ఏం బాగుపడుతుంది. ఓటమి వచ్చినప్పుడు, ఫలితాల్ని విశ్లేషించుకుని ముందడుగు వేయడం నాయకుడి లక్షణం. కానీ, అదే నాయకుడు 'ఎందుకు ఓడిపోయామో అర్థం కావడంలేదు' అని చేతులెత్తేస్తే క్యాడర్‌కి తమ దారి తాము చూసుకోవడం తప్ప వేరే ఛాన్స్‌ వుండదు.


చంద్రబాబు తీరు, తెలుగుదేశం పార్టీని ముంచేసేలానే వుంది. 'ఓడిపోయిన ప్రతిసారీ ఏదో ఒక కారణం కన్పించింది.. కానీ, ఇప్పుడు కారణం దొరకడంలేదు..' అంటూ చంద్రబాబు పార్టీ ముఖ్యనేతల సమావేశంలో తాజాగా 'నిర్వేదం' చూపారు. కర్ణుడి చావుకి ఎన్ని కారణాలున్నాయోగానీ, తెలుగుదేశం పార్టీ ఓటమికి మాత్రం అంతకన్నా ఎక్కువే కారణాలున్నాయి. అన్నిట్లోకీ అతి ముఖ్యమైన కారణం అవినీతి.


పోనీ, అవినీతిని జనం పట్టించుకోలేదా.? అంటే, అసమర్థత పాలన మరో కారణంగా కన్పిస్తుంది. ఇవేవీ కాదనుకున్నా.. గత ఐదేళ్ళలో టీడీపీ అరాచక పాలన కళ్ళ ముందు కదలాడుతుంది. పార్టీ ఫిరాయింపులు కావొచ్చు, మహిళలపై టీడీపీ నేతల దాడులు కావొచ్చు.. దళితులపై టీడీపీ దౌర్జన్యాలు కావొచ్చు.. ఒకటేమిటి.? కుప్పలు తెప్పలుగా కారణాలున్నాయి టీడీపీ ఓటమికి. కానీ, చంద్రబాబుకి ఆ కారణాలేవీ అసలు కారణాలుగానే కన్పించవు

మరింత సమాచారం తెలుసుకోండి: