అమెరికా అధ్యక్షుడి పర్యటనల కోసం కొత్త విమానం ఏర్పాటు చేయబోతున్నారు. బోయింగ్ తయారు చేయబోయే కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ 747 విమానం విలువ 3.9 బిలియన్ డాలర్లు. అయితే ఇన్నాళ్లూ మనం చూస్తున్న అమెరికా అధ్యక్షుడి ఎయిర్ ఫోర్స్ వన్ తరహాలో ఈ కొత్త విమానం ఉండబోదని తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ దీనికి సరికొత్త లుక్ ఇవ్వబోతున్నారు.

తన ఒవల్ ఆఫీసులో ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త విమానం డిజైన్ ను చూపించారు. విమానం ఫోటోని పట్టుకొని దీనిని తానే డిజైన్ చేశానని చెప్పుకున్నారు. ఇది తన కోసం కాదని ఇతర అధ్యక్షుల కోసమని చెప్పారు. అదే నిజం కూడా. ఎందుకంటే ఈ కొత్త విమానాలు 2024 వరకు వచ్చే అవకాశాలే లేవు. 2020లో మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచినా ఆయన పదవీ కాలం ముగిసే నాటికి ఈ కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానాలు వస్తాయి. అప్పటికీ ఆయనను ఈ మార్పుకు అనుమతించాలి.

చివరిసారిగా ఎయిర్ ఫోర్స్ వన్ ను 1962లో రీడిజైన్ చేశారు. అప్పటి నుంచి విమానం మోడల్స్ మారుతూ వచ్చాయి కానీ దానిపైన ప్రత్యేకమైన నీలం, సియాన్ కోట్ రంగులు మాత్రమే ఉంటూ వచ్చాయి. బేబీ బ్లూ, తెలుపులను పక్కకు నెట్టి ట్రంప్ దానికి దేశభక్తియుత ఎరుపు, తెలుపు, నీలం రంగులను ఎంపిక చేశారు. అయితే ఈ రంగులు బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాల మాదిరిగా ఉన్నాయని కొందరంటే ట్రంప్ ప్రైవేట్ జెట్ చూసినట్టుందని మరికొందరు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: