అసెంబ్లీలో ఎప్పుడైతే జగన్ నేను తలుచుకుంటే చాలు ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారో లెక్కే లేదంటూ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఫలితాలు వెలువడిన మరుసటిరోజు నుంచే టీడీపీ నుంచి కొందరు వైసీపీని సంప్రదించారు. అయితే జగన్ మనసు తెలుసుకున్న వీళ్లలో కొందరు అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ వైసీపీలోకి వస్తామని చెబుతున్నారు. వాళ్లు ఎవరెవరు అనే విషయంలో మాత్రం వైసీపీ నేతలు పూర్తి క్లారిటీ ఇవ్వడంలేదు.


పార్టీ ఫిరాయింపులపై స్పష్టమైన వైఖరితో ఉన్నారు సీఎం జగన్. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాతే శిల్పా చక్రపాణి రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారు. అధికారం చేతిలో లేనప్పుడే ఒక ఎమ్మెల్సీ వస్తానంటే పదవి వదులుకొని రమ్మని చెప్పిన జగన్, ఇప్పుడు మాట మార్చే అవకాశం ఎంతమాత్రం లేదు. ఇదే విషయాన్ని నిండుసభలో చెప్పారు కూడా.


దీంతో పార్టీ మారాలనుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ధైర్యం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేసి వైసీపీలో చేరతామంటూ ముందుకొస్తున్నారు. అయితే వీరు జగన్ ముందు రెండు కండిషన్లు పెడుతున్నారట. ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థిగా తమకే అవకాశం ఇవ్వాలి, కుదరని పక్షంలో తమ కుటుంబ సభ్యులను నిలబెట్టాలి. రెండోది జగన్ తమ నియోజకవర్గంలో ప్రచారం చేయాలి. వీటికి జగన్ ఓకే అంటే వెంటనే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా రాసిపారేస్తామంటూ ఉబలాటపడిపోతున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.

మరింత సమాచారం తెలుసుకోండి: