ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్రబాబు నాయుడుకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు చింత చచ్చినా పులుపు చావలేదని పెడన ఎమెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎయిర్ పోర్ట్ లో చెక్ చేయడం నిభందనల ప్రకారం జరిగిందని అయినా...దాన్ని సైతం పచ్చపత్రికలు తప్పుదోవపట్టిస్తున్నాయని మండిప‌డ్డారు. విజయవాడలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తాజాగా ఆయ‌న మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షనేత హోదాలో మొదటిసారి ఎయిర్ పోర్టుకు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు చంద్రబాబుకు నిభందనలపట్ల అవగాహన కల్పించారని అన్నారు. ఈ విష‌యం టీడీపీ నేతలు అది తెలుసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. 23 సీట్లకే పరిమితమైనా పశ్చాతాపం లేకుండా దురుద్దేశ‌పూర్వ‌క రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 


హత్య రాజకీయాలంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని, టీడీపీ హయాంలో వైసీపీ నేతలు కార్యకర్తలను బయటికి రాకుండా కేసులు పెట్టి వేదించారని గుర్తు చేశారు. `చంద్రబాబు ఓ వెన్నుపోటు దారుడు. చంద్రబాబు బండారం ప్రజలకు తెలిసింది కనుకే తెలుగుదేశం పార్టీకి ప్రజలు బొంద పెట్టారు. చంద్రబాబు పాలనలో హత్య, కుల రాజకీయాలు ,అరాచక పాలన సాగింది. హత్యా రాజకీయాలకు పేటెంట్ చంద్రబాబు. బాబు హయాంలో ఎన్ని హత్యలు జరిగాయి,ఎన్నిదోపిడీలు జరిగాయి. టీడీపీ నేతలు అధికారం అడ్డుపెట్టుకుని అధికారులపై దాడులు చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయి అందుకే వారు ఓటుతో బుద్ది చెప్పారు. ఏ ఒక్క వ్యక్తి పైన కూడా దాడి జరగకుండా చూడాలని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తెలుగుదేశం నాయకులు టాక్స్‌ల పేరుతో దోచుకున్నారు కోడెల కుమారుడు,కుమార్తె పేరు చెబితేనే గుంటూరు ప్రజలు వణికి పోతున్నారు. 


ఈ ఐదు సంవ‌త్స‌రాల్లో చంద్రబాబు సాధించింది శూన్యం.  వైసీపీ మీద ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారిమీద నిందలు వేస్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. మాకు 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల‌లో ఎవరి అవసరం లేదు. మేం అలాంటివి ప్రోత్సహించం.మేం ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాజ్యాంగ వ్యతరేక చర్యలను నిరసిస్తూ అసెంబ్లీకి వెళ్లలేదు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు పారదర్శకమైన పరిపాలన చేస్తున్నారు. టీడీపీ నేతలు అవాకులు చెవాకులు మానుకుని వ్యవహరిస్తే బాగుంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హుందాతనం..పాలనా విధానం బేరీజు వేసుకోవాలి`` అని హిత‌వు ప‌లికారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: