ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు భారీ మెజారిటీ ఇచ్చి గెలిపించారు.  ఈ స్థాయిలో గెలుపు సాధ్యం అవుతుందని ఎవరూ ఊహించలేదు.  ఊహించని విధంగా గెలుపును అందిపుచ్చుకోవడంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.  అధికారంలోకి వచ్చిన వెంటనే తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకుంటూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. 

 

ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చి ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని జగన్ చెప్పారు.  ఒక మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి ఆరు నెలల సమయం అడిగాడు. ఆరు నెలలలో రాష్ట్రాన్ని ఒక దారిలోకి తీసుకొస్తానని చెప్పిన సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, జగన్ వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షుడు దేవినేని అవినాష్ సంచనల వ్యాఖ్యలు చేశారు. 

 

 భారీ మెజారిటీతో విజయం సాధించిన వైకాపాకు శుభాకాంక్షలు చెప్పిన దేవినేని అవినాష్.. ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవడానికి ఆరు నెలల సమయం అడిగారు, సరే జగన్ కు ఆరునెలల సమయం ఇస్తున్నాం.  ఇచ్చిన వాగ్దానాలు నెరవేరిస్తే సరే.. లేదంటే.. ప్రభుత్వంపై పోరాటం చేయడం తథ్యం అంటున్నాడు దేవినేని అవినాష్. 

 

యూత్ లీడర్ గా ఉన్న అవినాష్ గుడివాడ నియోజక వర్గం నుంచి టిడిపి తరపున పోటీ చేసి, నాని చేతిలో ఓడిపోయారు.  గుడివాడలో నానికి ఓటమిలేదు.  ఈ విషయం తెలిసిందే.  నాని అడ్డాలోకి వెళ్లి గెలవాలి అంటే కష్టమే కదా మరి!


మరింత సమాచారం తెలుసుకోండి: