ప్ర‌తి విష‌యాన్నీ త‌న‌కు అనుకూలంగా మార్చుకునే టీడీపీ అధినేత చంద్ర‌బాబు అండ్ బ్యాచ్ తాజాగా గ‌న్న‌వ‌రం విమా నాశ్ర‌యంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ను కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకుని ప్ర‌జ‌ల నుంచి సింప‌తీ పొందాల‌ని ప్ర‌య త్నించింది. అయితే, ఇది బెడిసి కొడుతోంది. ముందుగా నిజ‌మే విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబుకు ఘోరాతి ఘోర‌మైన అవ‌మానం జ‌రిగింద‌ని పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌లు పెద‌వి విరిచారు. అయితే, ఆ త‌ర్వాత అస‌లు విష‌యం తెలిసి.. టీడీ పీ ప్ర‌వ‌ర్త‌న‌ను దుయ్య‌బ‌డుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. శుక్రవారం విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భ‌ద్ర‌తా సిబ్బంది త‌నిఖీ చేశారు. 


దీంతో దీనిని టీడీపీ రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చేలా ఉప‌యోగించుకుంది. చంద్ర‌బాబును ఘోరంగా అవ‌మా నించార‌ని, జెడ్‌ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న నాయ‌కుడిని ఇలా అవ‌మానించ‌డం వెనుక జ‌గ‌న్‌, మోడీల హ‌స్తం ఉంద‌ని త‌న అనుకూల సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున దుమ్మెత్తిపోయించింది. ఇంత జ‌రుగుతున్నా కూడా టీడీపీ అధినేత కానీ, ఆయ‌న కుమారుడు కానీ స్పందించ‌లేదు. అంటే.. దీనిద్వారా అయినా ప్ర‌జ‌ల్లో చంద్ర‌బాబు సింప‌తీ సాధించాల‌నే విష‌యం అర్ధ‌మైంది. ఇక‌, విమానాశ్ర‌యాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు చంద్ర‌బాబును త‌నిఖీ చేయ‌లేదా? అంటే.. నిజ‌మే ఆయ‌న సీఎంగా ఉన్నారు కాబ‌ట్టి నిన్న మొన్న‌టి వ‌రకు ఆయ‌న‌ను త‌నిఖీ చేయ‌లేదు. 


కానీ, నేడు ఏపీలో ప్ర‌భుత్వం మారి, చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్షంలోకి వెళ్లారు. దీంతో సీఎం హోదా పోయి.. ప్ర‌తిప‌క్ష నాయ‌కుడి హోదానే మిగిలింది. ప్రోటోకాల్‌, విమానాశ్ర‌యాల చ‌ట్టం ప్ర‌కారం సెక్యూరిటీ చెక్ నుంచి కొంద‌రికి మాత్ర‌మే మిన‌హాయింపు ఉంటుంది. రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి, గ‌వ‌ర్న‌ర్లు, ఎన్నిక‌ల క‌మిష‌న్ ప్ర‌ధానాధికారి, హైకోర్టు, సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు స‌హా సీఎం, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంల‌కు సెక్యూరిటీ చెక్ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. అంతే త‌ప్ప రాష్ట్రాల మాజీ సీఎంల‌కుకానీ, ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు కానీ ఎక్క‌డా సెక్యూరిటీ చెక్ నుంచి మిన‌హాయింపు ఉండ‌దు. 


గ‌తంలో వైసీపీ అధినేత ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా ఉన్న‌ప్పుడు ఎప్పుడు విమానాశ్ర‌యాల‌కు వెళ్లినా హుందాగా సెక్యూరిటీ చెక్ అయిన త‌ర్వాతే విమానంలోకి అడుగు పెట్టేవారు.ఈ విష‌యం తెలిసి కూడా ఫార్టీ ఇయ‌ర్స్ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు చాలా సిల్లీ విష‌యాన్ని పెద్ద‌ది చేసుకుని, త‌న‌కు సింప‌తీ వ‌చ్చేలా ప్ర‌య‌త్నం చేయ‌డం ఆయ‌న అనుభ‌వాన్నే ప్ర‌శ్నార్థ‌కం చేస్తోంది. నాకు మించిన రాజ‌కీయ నాయ‌కుడు లేడ‌ని చెప్పే చంద్ర‌బాబు ఇలా వ్య‌వ‌హ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఇప్ప‌టికైనా టీడీపీ బ్యాచ్ అసలు విష‌యాన్ని గ్ర‌హిస్తుందో లేదో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: