ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు పాల్గొన్న సంగతీ తెలిసిందే. ఏపీ తరుపున సీఎం జగన్ ప్రత్యేక హోదా కోసం తన వాదనను వినిపించారు.  విపక్షంలో ఉన్న సమయం నాటి నుంచి ఏపీకి ప్రత్యేక హోదాపై తనదైన శైలి పోరాటం సాగిస్తున్న జగన్... తాజా ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత కూడా అదే పోరాట స్ఫూర్తితో సాగుతున్నారు.


అంతేకాదండోయ్... వరుసగా రెండో సారి కూడా స్పష్టమైన మెజారిటీ సాధించి తనకు తిరుగే లేదన్నట్లుగా వ్యవహరిస్తున్న ప్రదాని నరేంద్ర మోదీని ఏకంగా నిలదీసినంత పనిచేశారు. అసలు ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకివ్వరో చెప్పాలంటూ జగన్ చేసిన ప్రసంగం అటు కేంద్రంతో పాటు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలను కూడా ఆకట్టుకుందనే చెప్పాలి.


నేటి మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ భేటీకి ఏపీ సీఎం హోదాలో జగన్ హాజరయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సాగుతున్న జగన్... నీతి ఆయోగ్ లో వ్యవహరించాల్సిన ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారు. సమావేశంలో తన వంతు రాగానే గొంతు సవరించుకున్న జగన్... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని తన వాయిస్ చాలా గట్టిగా వినిపించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: